రాశి ఫలాలు.29-మే-2021

1 min read

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈

శివ రామ గోవింద నారాయణ మహాదేవా

రాశి ఫలాలు

🐐 మేషం
ధర్మ సిద్ధి ఉంది. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేస్తారు. కొన్ని చర్చలు ఫలిస్తాయి. మీరు అనుకున్నది నెరవేరుతుంది. ప్రసన్నాంజనేయ సోత్రం పారాయణ చేయాలి.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా.. వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. కనకధారాస్తవం పఠించాలి
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఒక ముఖ్యమైన విషయంలో ఆశించినదానికంటే ఎక్కువ పురోగతి ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మొదలుపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
తలపెట్టిన కార్యాలు నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటాయి. మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివ నామ స్మరణ ఉత్తమం.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసును కలవరపెడుతుంది. అకారణ కలహసూచన ఉంది. దైవారాధన ఎట్టిపరిస్థితుల్లోనూ మానకండి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.
💃💃💃💃💃💃💃

తుల
మీ మీ రంగాల్లో ఎక్కువగా కష్టపడాలి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. సాయిబాబా నామస్మరణ శుభ ఫలితాలనిస్తుంది
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శివ స్తోత్రం పఠించడం మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
కొన్ని కీలక నిర్ణయాలు మీకు అనుకూలంగా వెలువడతాయి. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కొందరి ప్రవర్తన మనస్తాపానికి గురిచేస్తుంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ ఆరాధన మంచిది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
సమాజంలో కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మంచి జరుగుతుంది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలి. దుర్గ స్తోత్రం పఠించాలి.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.
🦈🦈🦈🦈🦈🦈🦈
సమస్తసన్మంగళాని భవన్తు, 👌
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌
శుభపరంపరాప్రాప్తిరస్తు,👌
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌
లోకాసమస్తా సుఖినోభవంతు👌
సర్వేజనాః సుఖినోభవ👌

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

Total Page Visits: 40 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed