SGS TV Telugu

24×7 News

వైభవంగా…. అరుణ పారాయణం …. మహా సౌర హోమం

1 min read

వైభవంగా…. అరుణ పారాయణం …. మహా సౌర హోమం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో ఆదివారం ఉదయం 9 గంటలకు మహా సౌర హోమం, శత రుద్రయ పారాయణ, అరుణ పారాయణం అరుణ పారాయణం వైభవంగా జరిగాయి. రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ ఆదేశాల మేరకు... దేశం సుభిక్షంగా ఉండాలని కరోనా మహమ్మారి ప్రబలకుండా తగ్గుముఖం పట్టాలని సూర్య దేవాలయంలో ఈ ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించామని ఈఓ వి. హరి సూర్య ప్రకాష్ గారు తెలిపారు. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ గారు మాట్లాడుతూ లోకానికి వెలుగు నిచ్చే, ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ప్రబలకుండా రాష్ట్రం, దేశం బయటపడాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. Covid 19 నిబంధనల ప్రకారం... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమం సూర్య దేవాలయంలో నిర్వహించబడినదని ఈవో గారు తెలిపారు.

Total Page Visits: 11 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *