SGS TV Telugu

24×7 News

రాశి ఫలాలు

1 min read

​మేషం..

మేష రాశి వారికి ఈ రోజు ప్రత్యేకంగా ఉంటుంది. చేదును మాధుర్యంగా మార్చుకునే కళను మీరు నెరవేర్చుకోవాలి. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. సంతానం వైపు నుంచి నిరాశ పరిచే వార్తలను పొందవచ్చు. సాయంత్రం సమయంలో పనులు నిలిచిపోయే అవకాశముంది. మీకిష్టమైనవారితో కలిసి రాత్రి సమయంలో ఆనందంగా గడుపుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీకు అదృష్టం 67 శాతం మద్దతు ఇస్తుంది.

​వృషభం..

ఈ రోజు వృషభ రాశి వారికి సంతృప్తికరంగా ఉంటుంది. రాజకీయ రంగంలో చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అధికారులతో పరిచయాల వల్ల ప్రయోజనం పొందవచ్చు. నూతన ఒప్పందాల ద్వారా మీరు పురోగతి సాధిస్తారు. రాత్రి సమయంలో అసహ్యకరమైన వ్యక్తులను కలవడం వల్ల అనవసరమైన బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంతానం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ రోజు మీకు అదృష్టం 69 శాతం కలిసి వస్తుంది.

​మిథునం..

ఈ రోజు మిథున రాశి వారు విలువైనదాన్ని కోల్పోయే ప్రమాదముంది. పిల్లలు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు అందుకోవడం వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. ఆగిపోయిన పనులు సాయంత్రం నాటికి తిరిగి పూర్తి చేస్తారు. రాత్రి సమయంలో మీరు అధికారాన్ని పొందుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉండండి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఈ రోజు మీకు అదృష్టం 64 శాతం మద్దతు ఇస్తుంది.

​కర్కాటకం..

చంద్రుడు ఏడో పాదంలో ఉండటం వల్ల ఈ రోజు కర్కాటక రాశి వారికి సంపూర్ణ సంపదను సూచిస్తుంది. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది. రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుంది. పిల్లల బాధ్యత నెరవేర్చవచ్చు. ప్రయాణాల్లో ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా లాభం పొందుతారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు మీకు శుభవార్తలు అందుకుంటారు. ఈ రోజు మీకు అదృష్టం 97 శాతం కలిసి వస్తుంది.

​సింహం..

ఈ రోజు రాశి స్వామి సూర్యుడుతో పాటు నాలుగు గ్రహాలు వస్తాయి. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. మాటల మృదుత్వం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. సూర్యుడు గమనం వల్ల కంటికి సంబంధించి సమస్యలు కలిగే అవకాశముంది. తమలో తాము పోరాడటం ద్వారా శత్రువులు నాశనం అవుతారు. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు మీకు అదృష్టం 96 శాతం మద్దతు ఇస్తుంది.

​కన్య..

మీ రాశి అధిపతి బుధుడు కారణంగా ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొనసాగుతున్న ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. పిల్లల వైపు నుంచి సంతృప్తికరమైన వార్తలు పొందుతారు. మధ్యాహ్నం సమయంలో చట్టపరమైన వివాదాలు, దావాల్లో విజయం మీకు ఆనందానికి కారణం అవుతుంది. మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రోజు మీకు అదృష్టం 91 శాతం కలిసి వస్తుంది.

​తుల..

తులా రాశి వారికి ఈ రోజు ఆహ్లాదకరమై వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులందరి ఆనందం పెరుగుతుంది. చాలా రోజులుగా కొనసాగుతున్న లావాదేవీలు పరిష్కరించబడుతుంది. చేతిలో తగినంత డబ్బు ఉన్నందున మీకు ఆనందం లభిస్తుంది. మీ చేతుల్లో ప్రత్యర్థులు ఓడిపోతారు. ఈ రోజు మీరు చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాలు తీవ్రతరం అవుతాయి. ఈ రోజు మీకు అదృష్టం 93 శాతం మద్దతు ఇస్తుంది.

​వృశ్చికం..

వృశ్చిక రాశిలో తృతీయ పాదంలో శని, మకరంలో చంద్రయోగం మరో ఏడో రోజుల పాటు ఉంటుంది. ఫలితంగా గాలి, మూత్రం, రక్తం వంటి కొన్ని అంతర్గత రుగ్మతలు పాతుకుపోయాయి. ఇవన్నీ పరిశీలించి ఈ విషయంలో మంచి వైద్యుడిని సంప్రదించండి. మీరు తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నడిస్తే మంచిది. అనవసర విషయాలను పట్టించుకోండి. ఈ రోజు మీకు అదృష్టం 62 శాతం కలిసి వస్తుంది.

​ధనస్సు..

ఈ రోజు మీ శత్రులువు మిమ్మల్ని ప్రశంసిస్తారు. అధికార పార్టీ నుంచి సామీప్యత, పొత్తులు లభిస్తాయి. అత్తమామల వైపు నుంచి తగిన మొత్తాన్ని పొందుతారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు లభిస్తాయి. ఒకరితో సమావేశం జరిగే అవకాశముంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీకు అదృష్టం 97 శాతం మద్దతు ఇస్తుంది.

​మకరం..

మకర రాశి వారికి ఈ రోజు కుటుంబ, ఆర్థిక విషయాల్లో విజయం పొందుతారు. పనిప్రదేశంలో నూతన ప్రయత్నాలు వృద్ధి చెందుతాయి. సహోద్యోగుల నుంచి గౌరవం లభిస్తుంది. సాయంత్రం సమయంలో ఎలాంటి వివాదాలు, గొడవలు పడకండి. మీకిష్టమైనవారిని మీ ఇంటికి ఆహ్వానిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆహారం, పానీయాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు మీకు అదృష్టం 98 శాతం కలిసి వస్తుంది.

​కుంభం..

ఈ రోజు మీ ఆరోగ్యం అంత అనుకూలంగా ఉండదు. ఫలితంగా మీ ఆనందం చెదిరిపోవచ్చు. రాశి స్వామి శని తిరోగమనం వల్ల శత్రువుల నుంచి వివాదాలు తొలుగుతాయి. తెలివితేటలతో చేసిన పనిలో మీరు నష్టం చవిచూడవచ్చు. వ్యతిరేక వార్తలను విన్న తర్వాత ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యర్థ వ్యయాన్ని నియంత్రించండి. ఈ రోజు మీకు అదృష్టం 65 శాతం మద్దతు ఇస్తుంది.

​మీనం..

ఈ రోజు మీ కొడుకు, కుమార్తే నుంచి వారి పనుల్లో గడుపుతారు. దాంపత్య జీవితంలో నెలకొన్న స్తబ్దతను అంతం చేస్తారు. ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయాణాలు చేయవచ్చు. అంతేకాకుండా స్వచ్ఛంద పనుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బృహస్పతి ప్రభావం వల్ల విలువైన వస్తువులను కోల్పోయే ప్రమాదముంది. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఈ రోజు మీకు అదృష్టం 67 శాతం కలిసి వస్తుంది.

Total Page Visits: 182 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *