SGS TV Telugu

24×7 News

గడప లక్ష్మీ స్వరూపం

1 min read

🙏గడప లక్ష్మీ స్వరూపం🙏

గ‌డ‌ప మీద కూర్చొవ‌డం కానీ, కాలు పెట్ట‌డం గానీ చేయకూడ‌దు. ఇంటి య‌జ‌మానికి ల‌క్ష్మీ క‌టాక్షం పొందాలంటే…. బ‌య‌ట‌కు వెళ్లేప్పుడు మ‌నహ్ పూర్వ‌కంగా గ‌డ‌ప‌కు న‌మ‌స్కారం చేయాలి. అలాగే బ‌య‌ట నుంచి లోప‌లికి వ‌చ్చేప్పుడు …….బ‌య‌ట కాళ్లు క‌డుక్కుని న‌మ‌స్కారం చేసి లోప‌లికి వ‌స్తే ఆ గృహంలో ల‌క్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్ప‌ర‌చుకుంటుంది. మ‌నం దేవాల‌యాల‌ను సంద‌ర్శించ‌న‌ప్పుడు కూడా …..త‌ప్ప‌నిస‌రిగా గ‌డ‌పకు న‌మ‌స్కారం చేసిన త‌ర్వాతే భ‌గ‌వంతుడికి న‌మ‌స్కారం చేసేందుకు వెళ్లాలి. ఇక్క‌డ ఇల్లు కూడా దేవాల‌య‌మే. ఈ గ‌డ‌ప‌కు ఇంత గొప్ప‌ల‌క్ష‌ణ ఉంది. గడ‌ప‌కు రెండు వైపులా గుమ్మాలుంటాయి. ఆ గుమ్మాల‌కు ప‌సుపు, ఎరుపు రంగుల‌ను అలంక‌రించాలి. గ‌డ‌ప‌పై భాగాన స్వ‌స్థిక్, ఓంకారం త‌ప్ప‌నిసరిగా ఉండేలా చూసుకోవాలి. సింహ‌ద్వారానికి రెండు త‌లుపులు ఉండాలి.

ఈ మ‌ధ్య కాలంలో సింగిల్ డోర్ వాడుతున్నారు. వాస్తుశాస్త్ర రీత్యా అంత స‌బ‌భు కాదు. రెండు త‌లుపులు కూడా రెండు క‌ళ్లు. రెండు కిటికీలు రెండు వైపులా ఉంటే….. అవి రెండు చెవులు. మ‌న మాన‌వ శ‌రీరానికి…… గృహానికి అభినావ భావ సంబంధం ఉంది. ఇంటి గ‌డ‌ప‌, సింహాద్వారాన్ని బ‌ట్టి….. ఆ ఇల్లు ఎంత అభివృద్ధి చెందుతుందో చెప్ప‌గ‌ల స‌త్తా….. మ‌న‌కు వాస్తుశాస్త్ర‌ రీత్యా చెప్ప‌డం జ‌రిగింది. గ‌డ‌ప మీద తుమ్మితే వెంట‌నే నీళ్లు చ‌ల్లాలి. ఎందుకంటే ఆ గ‌డ‌ప నుంచి వ‌చ్చే అద్వీతియ శక్తి పుంజాల ప్ర‌భావం …ఈ వ్యక్తి తుమ్మి‌న‌ప్పుడు అనార్ధ‌దాయ‌క‌మైన ప్ర‌భావాన్ని ఇస్తుంది . కాబ‌ట్టి వెంట‌నే నీళ్లను చ‌ల్లితే ఆ దోషం పోతుంది. అందుకే గ‌డ‌ప మీద కూర్చొని దువ్వుకోవ‌డం, గ‌డ‌ప మీద కూర్చొని మాట్లాడుకోవ‌డం చేయ‌కూడ‌దు. గృహంలోకి ల‌క్ష్మీదేవి ప్ర‌వేశించ‌డానికి గ‌డ‌ప నాంది వాక్యం ప‌లుకుతుంద‌ని విష‌యాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో మ‌ర‌వ‌ద్దు. కాబ‌ట్టి గ‌డ‌ప విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌ల‌న్నీ పాటించి ల‌క్ష్మీదేవి కృప‌కు పాత్రులము కావాలి.


సేకరణ. భాను ప్రకాష్ ఆదూరి

Total Page Visits: 232 - Today Page Visits: 16

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *