*నకిలి విత్తనాలు పట్టివేత

…ఒకే మండలంలో రెండు చోట్ల లూజుగా అమ్ముతుండగా మాటు వేసి పట్టుకున్న టాస్క్ ఫోర్స్…పరారిలో ఒక్కరు.*

గద్వాల: నకిలి పత్తి విత్తనాల బారి‌ నుంచి‌ రైతులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం‌ కట్టు దిట్టమైనా చర్యలు తీసుకుంది.‌ అమ్మకం దారులపై పిడి యాక్టు అమలు చేయాలని జిల్లా అధికారులను అదేశించారు. జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం సభ్యులు నకిలి విత్తనాలు అమ్మే వారిపై ప్రత్యేక నిఘా‌పెట్టింది. గుటు చప్పుడు కాకుండా మాటుగా అమ్ముతున్న దాళారులను పట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. గురువారం మల్దకల్ మండల పరిధిలో ఆయా గ్రామాలలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. ఉదయం నాగర్ దొడ్డి గ్రామానికి చెందిన కుర్వ వెంకట్రాములు ఇంటిలో 200 KGల పత్తి విత్తనాలను స్వాదీనం చేసుకున్నారు. . గద్వాల్ సర్కిల్ టాస్క్ఫోర్స్ టీం సాయంత్రం శేషంపల్లి గ్రామానికి చెందిన ఎం.‌నర్సిములు S/O నర్సన్న అనే వ్యక్తి ఇంటిలో సుమారు 200 KG ల నకిలీ పత్తి విత్తనాలు 6 సగం సగం ప్లాస్టిక్ బ్యాగ్ లు స్వాదీనం చేసుకున్నారు. ఈ దాడులలో స్వాదీనం చేసుకున్న విత్తనాలను MAO పంచనామా నిర్వహించి తగు చర్య నిమిత్తం SHO మల్దకల్ ఫిర్యాదు చేశారు. ఈ‌దాడులో టాస్క్ ఫోర్స్ బృందం‌ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here