ఇళ్లకే పరిమితమైన ఖమ్మం జంప్ జిలానీలు
తమకు అవసరమైన చట్టాలు చేస్తారని ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం తో జనం చెప్పులు..రాళ్లనే ఆయుధాలు గా మార్చుకున్నారు. సంతల్లో పశువుల్లా అమ్ముడుపోవడం ఏంటి.. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి స్వతంత్రంగా వ్యవహరించలేడా
అంటూ clp నేత మల్లు భట్టి విక్రమార్క సంధించిన మాటల తూటాలు అగ్గిరాజేశాయ్. హస్తం గుర్తుపై గెలిచి పరిషత్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని వస్తున్న ఎమ్మెల్యే ల పై పోలీస్ స్టేషన్లలో జనం కేసులు పెడుతున్నారు. జనం మంట మీదున్నారని గ్రహించిన వనమా.. రేగా ఇంటికే పరిమితమయ్యారు. మహిళా ఎమ్మెల్యే ను ముందు పెట్టి రాజకీయం చేయాలని..క్రమంగా అక్రమార్కులను సక్రమార్కులుగా చూపించేందుకు అధికార పార్టీ వేసిన ఎత్తుగడను గోవింద్య్రాల ఓటర్లు చిత్తు చేశారు. తన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా నడివేశవిలో భట్టి చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణకు యాత్రకు జనస్పందన హోరెత్తుతోంది. ప్రశ్నిచే గొంతుక మరింత బలపడాలని.. భట్టి తన యాత్రను విస్తృతం..వేగవంతం చేయాలని..మేమంతా మీవెంటే అంటూ ఎక్కడికి అక్కడ ఏర్పాట్లు చేసుకుంటున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here