SGS TV Telugu

24×7 News

సెంట్రల్‌ విస్టాలో భారత ప్రధాని ఇల్లు…
కొత్త నివాస నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా

1 min read

సెంట్రల్‌ విస్టాలో భారత ప్రధాని ఇల్లు…
కొత్త నివాస నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా.. వచ్చే ఏడాది డిసెంబరులోగా పూర్తి
పర్యావరణ అనుమతులన్నీ జారీ..

దేశంలో కరోనా ఉధృతి ఊహించని స్థాయిలో పెరిగినా సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో ప్రధాని కొత్త నివాస భవన నిర్మాణ పనులను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే పలు భవనాలకు పర్యావరణ అనుమతులు దక్కాయి. మిగిలిన వాటికి కూడా పర్యావరణ అనుమతులు ఇచ్చినట్లు కేంద్ర ప్రజాపనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) తెలిపింది. మోదీ నివాస భవనాన్ని 2022, డిసెంబరులోగా పూర్తి చేస్తామని నిపుణుల మదింపు కమిటీకి వివరించింది. ఉప రాష్ట్రపతి నివాసం 2022, మేలోగా పూర్తి కానుంది. కాగా, కరోనాతో దేశం అతలాకుతలం అవుతున్న వేళ సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును కొనసాగించాలన్న నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

Total Page Visits: 14 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *