సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా: నవనీత్‌ కౌర్‌..

1 min read

ముంబై: నటి, అమరావతి పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్‌కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. నవనీత్ కౌర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని, నకిలీ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌తో ఆమె పోటీచేసి గెలుపొందారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అదసూల్ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణ చేపట్టి కీలక ఉత్తర్వులు వెలువరించింది. పంజాబ్‌ మూలాలు కలిగిన నవనీత్‌ కౌర్‌.. మహారాష్ట్రలో ఎస్సా కేటగిరికి రాదని, ఆమె కులధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేసింది. దీంతోపాటు రూ.2 లక్షల జరిమానా విధించింది. ఆరు నెలల్లోగా కుల ధ్రువీకరణకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను కోర్టు ముందుంచాలని నవనీత్ కౌర్‌ను ఆదేశించింది.

Total Page Visits: 99 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed