సిటింగ్‌ ఎంపీపై థర్డ్‌ డిగ్రీనా?

1 min read

దిగ్ర్భాంతికరం.. తక్షణం చర్యలు తీసుకోవాలి
మాండ్య ఎంపీ సుమలత ట్వీట్‌

అమరావతి, లోక్‌సభ సిటింగ్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కస్టడీలో పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర దిగ్ర్భాంతికరమని, నమ్మలేకపోతున్నానని కర్ణాటకలోని మాండ్య ఎంపీ సుమలత పేర్కొన్నారు. ఆమె ఒకప్పటి ప్రముఖ నటి, కర్ణాటకలో మంత్రిగా పనిచేసిన దివంగత నటుడు అంబరీశ్‌ భార్య అన్న సంగతి తెలిసిందే. ఎంపీపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం షాక్‌కు గురిచేసిందని శుక్రవారం ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. తక్షణం నివారణ చర్యలు చేపట్టకుంటే ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపై చాలా చెడు ప్రభావం చూపిస్తుందన్నారు. సహచర ఎంపీ రఘురామరాజుకు పూర్తి మద్దతుగా ఉంటానని, జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు

Total Page Visits: 125 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed