SGS TV Telugu

24×7 News

వాట్సాప్ ద్వారా మీ దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్ వివరాలు ఇలా తెలుసుకోండి

1 min read

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి టీకా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే.. ప్రస్తుతం ఎలా వ్యాక్సినేషన్ సెంటర్స్ వివరాలు తెలుసుకోవాలి.. ఎలా నమోదు చేసుకోవాలనేది. చాలా మందికి తెలియడం లేదు. అయితే.. మీ దగ్గర స్మార్ట్ చాలు.. మీరు ఉన్న ప్రాంతం నుంచే మీకు దగ్గర్లో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్ వివరాలు తెలుసుకోవచ్చు. అది కూడా ఉచితంగా, సులభంగా వ్యాక్సిన్కు రిజిస్ట్రేషన్కు మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు.

మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి భారతీయ పౌరునికి టీకా అందిస్తామని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ఏప్రిల్ 28 నుంచే ప్రారంభించింది. అయితే.. వ్యాక్సిన్ నమోదుకు మీ ఇంటికి దగ్గర్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ సెంటర్ల వివరాలు చాలా సులభంగా మీ స్మార్ట్ ఫోన్ లోని వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం…

ముందుగా మీ వాట్సప్లోని కరోనా హెల్ప్ డెస్క్ అయిన MYGOVలో ద్వారా మీకు దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్ సెంటర్ల వివరాలు తెలుసుకోవచ్చు. అందుకు మొదట మీరు మీ వాట్సాప్ మొబైల్ ద్వారా ‘NAMASTE’ అని టైప్ చేసి 9013151515 నంబర్కు మెసేజ్ సెండ్ చేయాలి. అప్పుడు మీకు ఆటోమెటిక్గా మీకు దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్ సెంటర్ల లొకేషన్ను చూపిస్తుంది. అప్పుడు మీకు అందుబాటులో ఉన్న టీకా సెంటర్ను ఎంచుకోవచ్చు.

అనంతరం మీరు, మీరు ఉంటున్న ఆరు అంకెల ఏరియా పిన్కోడ్ను టైప్ చేయాల్సి ఉంది.

దీంట్లో సెంటర్ వివరాలతో పాటు, రిజిస్ట్రేషన్ నమోదుకు లింకు కోవీన్ ద్వారా చేసుకోవాలి.

ఆరోగ్యసేతు యాప్ ద్వారా కూడా వ్యాక్సిన్కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లో అందుబాటులో ఉంటుంది. డిఫాల్ట్ ఆప్షన్ ద్వారా హిందిలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

కరోనాకు సంబంధించిన సందేహాలకు కేంద్ర ప్రభుత్వం ఈ వాట్సాప్ చాటబటు గత ఏడాది మార్చి లో ప్రారంభించింది.

Total Page Visits: 138 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *