మరోముప్పు.. కరోనా హైబ్రిడ్‌

1 min read

హనోయి(వియత్నాం): కరోనా ముప్పు ప్రపంచాన్ని ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. ఇప్పటికే కరోనా వేరియంట్స్‌తో అన్ని దేశాలు ఇబ్బందులు పడుతుంటే….. కొత్తగా కరోనా హైబ్రిడ్‌ రకం వెలుగు చూసింది. గత వేరియంట్‌లను మించి ప్రమాదకరంగా ఈ హైబ్రిడ్‌ రకం విస్తరిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

వియత్నాంలో సంకర కరోనా
సాధారణంగా వైరస్‌లు ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూనే ఉంటాయి. మొదట వచ్చిన వైరస్‌లతో పోల్చితే హాని చేయడంలో మార్పు చెందిన వైరస్‌ వేరియంట్లు చాలా ప్రమాదకరం. అయితే తాజాగా ఇలా రూపు మార్చుకున్న రెండు ప్రమాదకర వేరియంట్ల నుంచి అ‍త్యంత ప్రమాదకరమైన సంకర జాతి కరోనా వైరస్‌ పుట్టుకొచ్చింది. వియత్నాంలో సంకర కరోనా మ్యూటెంట్‌ ( హైబ్రిడ్‌ మ్యూటెంట్‌)ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఇండియాలో, బ్రిటన్‌లలో విపత్తును సృష్టించిన కరోనా మ్యూటెంట్ల లక్షణాలతో ఈ కొత్త హైబ్రిడ్‌ వేరియంట్‌ పుట్టుకొచ్చినట్టు వియత్నాం హెల్త్‌ మినిష్టర్‌ న్యూయెన్‌ థాన్‌ ప్రకటించారు.

Total Page Visits: 85 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed