పర్యావరణ వేత్త ,’చిప్కో’ ఉద్యమ సారథి సుందర్ లాల్ బహుగుణ కన్నుమూ

1 min read

పర్యావరణ వేత్త ,’చిప్కో’ ఉద్యమ సారథి సుందర్ లాల్ బహుగుణ కన్నుమూత.

సుందర్‌లాల్ బహుగుణ (జననం 1927 జనవరి 9) గాంధేయవాది, ఉద్యమకారుడు, పర్యావరణవేత్త. అతను చిప్కో ఉద్యమానికి నాయకత్వం వహించాడు. చెట్టు, పర్యావరణం, మానవ సమాజం అంటూ అందరికీ అర్థమయ్యే రీతిలో చిప్కో ఉద్యమాన్ని చేపట్టాడు. ఈ ఉద్యమ ఆలోచన అతని భార్యకు వచ్చింది. దీనిని అతను కార్యరూపంలో చేపట్టాడు. కొన్నేళ్లుగా హిమాలయాలలో అడవుల సంరక్షణ కోసం పోరాడుతున్నాడు. మొదట 1970 లలో చిప్కో ఉద్యమంలో సభ్యుడిగా, తరువాత 1980 ల నుండి 2004 ప్రారంభం వరకు టెహ్రీ ఆనకట్ట వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించాడు. అతను భారతదేశ ప్రారంభ పర్యావరణవేత్తలలో ఒకడు,తరువాత అతను చిప్కో ఉద్యమంతో సంబంధం ఉన్న ప్రజలతో కలసి పెద్ద ఆనకట్టలకు వ్యతిరేకంగా పర్యావరణ సమస్యలపై ఉద్యమాలను చేపట్టడం ప్రారంభించారు. వృక్షాలే కాదు.. అంతరించిపోతున్న జంతు, పక్షి జాతుల పరిరక్షణ కోసం పరితపించారాయన.

Total Page Visits: 12 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed