ద్విచక్రవాహనానికి తగిలించిన హెల్మెట్‌ను ఓ ఏనుగు మింగేసిన ఘటన అసోంలో

1 min read

ద్విచక్రవాహనానికి తగిలించిన హెల్మెట్‌ను ఓ ఏనుగు మింగేసిన ఘటన అసోంలోని గువహటిలో జరిగింది.

సత్‌గావ్‌ ఆర్మీ క్యాంపు సమీపంలో సంచరిస్తున్న ఓ ఏనుగు అక్కడే రోడ్డుపై నిలిపిన బైక్‌కు దగ్గరికి వచ్చి చూసింది.

అనంతరం బైక్‌ అద్దానికి తగిలించిన హెల్మెట్‌ను తొండంతో తీసుకుంది.

ఆ తర్వాత రెండు అడుగులు వేసిన గజరాజు ఆ హెల్మెట్‌ను పొట్టలో వేసుకుంది.

అనంతరం తనకేమీ తెలియదన్నట్లు ముందుకు సాగింది.

ఇదంతా సమీపంలో ఉండి గమనిస్తున్న కొంత మంది అధికారులు ఏనుగు హెల్మెట్‌ను కిందపడేసి తొక్కేస్తుందని భావించారు.

కానీ ఏనుగు మాత్రం నోట్లోకి వేసుకొని మింగేసింది. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Total Page Visits: 33 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed