ట్విటర్‌కు షాకిచ్చిన హైకోర్టు

1 min read

న్యూఢిల్లీ: పొట్టి సందేశాల సోషల్ మీడియా వెబ్‌సైట్ ట్విటర్‌‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని, అందులో ఎలాంటి మినహాయింపూ లేదని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఐటీ చట్టంలోని నిబంధనలను ట్విటర్‌ పాటించడంలేదంటూ న్యాయవాదులు ఆకాష్ వాజ్‌పేయ్, మనీష్ కుమార్ ద్వారా అమిత్‌ ఆచార్య ఇటీవల హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు(సోమవారం) విచారణ జరిపిన హైకోర్టు.. ఈ అంశంపై తమ వైఖరి చెప్పాలంటూ కేంద్రంతో పాటు ట్విటర్‌కు నోటీసులు జారీచేసింది. దీనిపై ట్విటర్ స్పందిస్తూ.. నూతన ఐటీ చట్టంలోని నిబంధనలను పాటిస్తున్నామని, రెసిడెంట్‌ గ్రీవెన్స్ అధికారిని కూడా నియమించామని కోర్టుకు తెలిపింది.

కానీ పిటిషనర్ తరపు న్యాయవాది దీనిని ఖండించారు. అలాంటి అధికారిని ట్విటర్ ఇంకా నియమించలేదని అన్నారు. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్‌ రేఖ పల్లి.. ఐటీ నిబంధనలను ట్విటర్‌తో సహా డిజిటల్ ప్లాట్ ఫాంలన్నీ పాటించాల్సిందేనని, అందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపులూ లేవని తేల్చి చెప్పారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను పాటించకుంటే.. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు

Total Page Visits: 33 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed