SGS TV Telugu

24×7 News

టీకా కోసం..2రోజుల్లో 2.4కోట్ల మంది రిజిస్ట్రేషన్‌

1 min read

టీకా కోసం..2రోజుల్లో 2.4కోట్ల మంది రిజిస్ట్రేషన్‌

రాష్ట్రాలను వేధిస్తున్న వ్యాక్సిన్‌ల కొరత

దిల్లీ: మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్‌ పంపిణీ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ దశలో 18 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ టీకా ఇస్తామని పేర్కొంది. ఇందుకోసం ఈ నెల 28వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వీలు కల్పించింది. దీంతో గడిచిన రెండు రోజుల్లోనే 2.4కోట్ల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఫేజ్‌ 3లో వ్యాక్సిన్‌ తీసుకునే వారు తప్పకుండా కొవిడ్‌ పోర్టల్‌/యాప్‌లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దీంతో రిజిస్ట్రేషన్‌ ప్రారంభమైన తొలిరోజునే (ఏప్రిల్‌ 28) 1.37కోట్ల మంది నమోదు చేసుకోగా.. ఏప్రిల్‌ 29న మరో 1.04 కోట్ల మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు 15.22కోట్ల డోసుల పంపిణీ పూర్తయినట్లు తెలిపింది. వీటిలో అత్యధికంగా మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే 67శాతం డోసులను అందించారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక పంజాబ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకున్నట్లు వెల్లడించింది.

Total Page Visits: 20 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *