గుడ్ న్యూస్: స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి

1 min read

గుడ్ న్యూస్: స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి

స్పుత్నిక్-వీ మరోవారంలో దేశీయ మార్కెట్లోకి

జులైలో లోకల్‌గా ఉత్పత్తి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న సమయంలో కేంద్రం శుభవార్త చెప్పింది. ర‌ష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ టీకా త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ వ్యాక్సిన్‌ భారతదేశానికి చేరుకోనుందని వచ్చే వారం నాటికి మార్కెట్లో లభించే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.

దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ విలేకరుల సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకేపాల్ ఈ ప్రకటన చేశారు. ప్రపంచంలోని మొట్టమొదటి వ్యాక్సిన్‌గా భావిస్తున్న స్పుత్నిక్-వీ టీకా స్థానిక ఉత్పత్తి జూలైలో ప్రారంభమవుతుందన్నారు. దాదాపు 15.6 కోట్ల మోతాదులను తయారు చేయవచ్చని అంచనా వేస్తున్నామని తెలిపారు. రష్యాకు చెందిన గమలేయ నేషనల్ సెంటర్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ టీకాను హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ తయారు చేయనుంది.

Total Page Visits: 20 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed