కరోనా రోగిపై అత్యాచారం…చికిత్స పొందుతూ మృతి

1 min read

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో దారుణం చోటు చేసుకుంది. మేల్ నర్సు చేతిలో అత్యాచారానికి గురైన ఓ మహిళా చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి.

భోపాల్ కు చెందిన 43 ఏళ్ల మహిళ కరోనాతో బాధపడుతూ ఏప్రిల్ 6న భోపాల్ మెమోరియల్ ఆస్పత్రి అండ్ రీసెర్చ్ సెంటర్ లో చేరింది. ఆ సమయంలోనే తనపై మెల్ నర్సు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది.

అయితే అప్పటికే మహిళా పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటీలేటర్ పై ఉంచారు. వైద్యం పొందుతూ తాజాగా ఆమె మృతి చెందింది.

మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పొలీసులు 40 ఏళ్ల సంతోష్ అహిర్ వార్ గా నిందితుడిగా గుర్తించారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసిన పొలీసులు భోపాల్ సెంట్రల్ జైలుకు తరలించారు.

Total Page Visits: 101 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed