కరోనాపై పోరు: విరుష్క ఫండ్‌ రైజింగ్‌ క్యాంపెయిన్‌

1 min read

న్యూఢిల్లీ: క‌రోనా సెకండ్ వేవ్ విజృంభణతో భారతదేశం అల్లాడిపోతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరగడంతో బాధితులకు బెడ్లు , ఆక్సిజన్ సిలిండర్ల ఏర్పాటు పెద్ద సమస్యగా మారుతోంది. ఈ కారణంగా చాలా మంది ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. ఇలాంటి విపత్కర ప‌రిస్థితులలో కరోనా బాధితులకు అండ‌గా నిలిచేందుకు సెల‌బ్రిటీలే గాక సామాన్య ప్రజలు సైతం తమకు తోచిన విధంగా సాయం చేయడానికి ముందుకు వ‌స్తున్నారు. ఈ క్రమంలో విరాట్‌, అనుష్క శ‌ర్మ దంప‌తులు ఇప్ప‌టికే క‌రోనా బాధితుల స‌హాయార్థం రూ. 2 కోట్లు విరాళం ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించగా, ఇప్పుడు ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ ప్రారంభించారు. తాజాగా అనుష్క‌, విరాట్ కోహ్లీలు త‌మ ట్విటర్ లో ఈ కార్యక్రమంపై వీడియోను కూడా షేర్‌ చేశారు. అందులో కరోనాపై పోరాటానికి తమ వంతుగా విరాళాలు సేక‌రించాల‌ని అనుకుంటున్నాం అని స్ప‌ష్టం చేశారు.

Total Page Visits: 14 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed