కడలూరులో పేలిన బాయిలర్.. నలుగురి మృతి

1 min read

చెన్నై: తమిళనాడులోని కడలూరులో ఓ బాయిలర్ పేలిన ఘటనలో నలుగురు మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని పురుగు మందుల తయారీ పరిశ్రమలో ఈ ఘటన జరిగింది. కంపెనీ రెండో అంతస్తులో ఉన్న బాయిలర్ ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న కార్మికుల్లో ఇద్దరు మంటలు అంటుకుని సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరూ పొగకు ఊపిరి ఆడక మరణించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు

ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోని ఫ్యాక్టరీలు, కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Total Page Visits: 14 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed