ఆ పథకాల వివరాలు ఇవ్వండి

1 min read

కొవిడ్‌తో అనాథలైన చిన్నారులకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు

అమలు తీరుపై వివరాలు కోరిన సుప్రీంకోర్టు

దిల్లీ: కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాల వివరాలు ఇవ్వాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. లబ్ధిదారుల ఎంపిక విధానం, వాటి అమలుపై పర్యవేక్షణ తదితర వివరాలను సమర్పించాలని ప్రభుత్వానికి మంగళవారం సూచించింది. బాలల సంరక్షణ కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాప్తికి సంబంధించి విచారణ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన పథకాల అంశాన్ని కోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై విచారణ ఈ నెల 7న జరగనుంది. దిల్లీ, కేరళ సహా చాలా రాష్ట్రాలు ఇప్పటికే కొవిడ్‌ బాధిత చిన్నారులకు అండగా నిలిచేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రకటించాయి.

రెండోసారి అధికార పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చిన్నారుల కోసం శనివారం ప్రధాని నరేంద్ర మోదీ పలు పథకాలు ప్రకటించారు. ఉచిత విద్యతో పాటు 23 ఏళ్లు నిండాక వారికి రూ.10 లక్షలు అందజేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ నిధిని పీఎం కేర్స్‌ ద్వారా ఇవ్వనున్నట్లు తెలిపారు. 11 నుంచి 18 ఏళ్ల బాలలకు ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో సీటు ఇవ్వడం లేదా ప్రయివేటు విద్యాలయాల్లో చేరిన పిల్లలకు ఫీజులు కూడా చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 1 నుంచి మే 25 మధ్య కాలంలో కొవిడ్‌ కారణంగా సుమారు 577 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి  స్మృతి ఇరానీ పలు నివేదికల ఆధారంగా వెల్లడించారు.

Total Page Visits: 12 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed