శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజ లకు అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది ??

1 min read

మరీ ముఖ్యంగా రాహు, కేతు పూజకై శ్రీకాళహస్తి లోని గుడికి రాహు కేతువుల గ్రహణ సమయం కాలంలో పూజలు జరుగుటకు గల ఆంతర్యం ???

ఈ దేవాలయంలో పరమేశ్వరుడు తూర్పు దిశ యందు కూర్చుండి పశ్చిమము చూచుట మనము గమనించ దగ్గ విశేషం. అలాగే పడమర లో అమ్మవారు కూర్చుండి తూర్పు లో ఉన్న ఈశ్వరుని చూచుట గమనించగలము. (ఆది అంతము)( ప్రకృతి పురుషుడు) ఒకరి కొకరు ఎదురెదురుగా ఉండటము .

ఈ విషయమును మరొక విధముగా చెప్పదలచుకుంటే రాశి చక్రమూలో రాహువు కేతువు లు ఒకరికొకరు ఎదురెదురుగా ఉంటారు. ఈ దేవాలయములో పరమేశ్వరుని శిరముపై పంచ తలలు కేతు గాను . అమ్మవారు ఏక సిర రాహు గాను పరిగణించ వలెను.

ఈ దేవాలయంలో రాహుకాలంలో రాహు కేతువుల పూజ ప్రశస్తము అయితే ప్రతి రోజు రాహుకాలము వచ్చును. కానీ ఆ సమయంలో స్వామివారిని దర్శించుకున్న స్వామి వారి తల పై పంచ నాగులు కేతువు దర్శనము కనపడును. అయితే రాహు గా అమ్మవారిని పరిగణించినపుడు సోమవారము నాడు శుక్రవారం మాత్రమే అమ్మవారికి నడుమునకు అలంకరించ్చే వడ్రాణం రూపంలో రాహు కనబడును.

అమ్మవారికి శుక్రవారం రోజున వజ్రాల కిరీటం నడుమునకు ఒక తల నాగుపాము వడ్రాణం గాను బంగారము తో తయారు చేసిన చీర తో అలంకరింపబడును. కనుక శ్రీకాళహస్తి లో సోమవారం శుక్రవారం రాహుకాల సమయంలో మాత్రమే . ఈ విషయమును గమనించి రాహు కేతువుల దోషనిమిత్తము సోమవారం శుక్రవారం రాహుకాలంలో ప్రశస్తమని గమనించగలరు.

( సేకరణ ).ఆదూరి భాను ప్రకాష్

Total Page Visits: 165 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed