శనేశ్వరస్వామి దేవాలయం, మందపల్లి, కొత్తపేట మండలం, తూ.గో జిల్లా

1 min read

హిందూ దేవాలయాలలో అనేక చోట్ల శని గ్రహము “నవగ్రహాలలో”

ఒక భాగంగా ఉంటుంది. కానీ భారతదేశంలో ఒక్క శని ని మాత్రమే

పూజించే మందిరాలలో మందేశ్వర స్వామి దేవాలయం ఒకటి.

మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం. వాస్తవానికి సోమేశ్వర స్వామి ఆలయం అయినా, శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. జాతక చక్రంలో శనితో సమస్యలున్నవారు కూడా వస్తుంటారు.

ఏటా శ్రావణ మాసం లోనూ, శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శనిత్రయోదశి నాడు,మహాశివరాత్రి రోజున ఇక్కడికి వచ్చేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. శనీశ్వరుడికి తైలంతో ఇక్కడ అభిషేకం చేస్తారు. నల్లటి వస్త్రాలు దానం చేస్తారు. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని, వారి కోర్కెలు తీరిన తరువాత మొక్కులు చెల్లిస్తుంటారు.

రాష్ట్రంలోని అతిపురాతన పుణ్యదేవాలయమైన శ్రీ శ్రీ శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామిని దర్శించుకోవడం మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా.. శనీశ్వరునికి ప్రీతికరమైన “శనిత్రయోదశి” పర్వదినాన మందేశ్వరునికి విశేష పూజలు గావించిన వారికి శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.

మీ ఈతిబాధలు, సమస్త దోషములు తొలగిపోవాలంటే… “శనిత్రయోదశి” నాడు మందేశ్వర స్వామిని దర్శించుకుని ఏకాదశి రుద్రాభిషేకం, తైలాభిషేకం చేయించండి. శనిత్రయోదశి శనివారమే రావడం విశేషమని పండితులు చెబుతున్నారు. ఈ రోజున శనీశ్వరునికి ప్రతే పూజలు చేయించేవారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయ విశ్వాసం.

మందేశ్వర ఆలయానికి ఎలా వెళ్లాలంటే

మందపల్లి గ్రామం రాజమండ్రి కి 38 కి.మి., కాకినాడ కు 60 కి.మీ., అమలాపురంకు30 కి.మి., పురాణ ప్రసిద్ధి గాంచిన ఈ దివ్యక్షేత్రానికి తూర్పుగోదావరి జిల్లా “రాజమండ్రి” నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ద్వారా “రావులపాలెం” చేరుకోవాలి. రావులపాలెం నుంచి మందేశ్వర స్వామి వారి ఆలయం సుమారు 9 కిలోమీటర్లు దూరంలో ఉంది. రమణీయమైన కోనసీమ ప్రాంతం “మందపల్లి” గ్రామంలో ఈ పుణ్యక్షేత్రం వెలసి ఉంది.

అలాగే పరమేశ్వరుడు మునులకు శనైశ్చర కవచం బోధించాడు. శని అంటే శక్తి. శనీశ్వరుడంటే శివభక్తి. సింగణాపురంలో శని శిలామూర్తిగా వెలసాడంటారు. గుడి, గోపురం లేని దేవతగా భక్తులచే పూజలందుకుంటున్నాడు ఈ క్షేత్రంలో మద్యపానం, మాంసాహారం నిషిద్ధం. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని మందపల్లిలో ఈ శనీశ్వరాలయం ఉంది. ద్రావిడ శైలిలో నల్లరాతిపై మలచిన ఈ విగ్రహాన్ని మార్గశిర శుద్ధ త్రయోదశినాడు అభిషేకిస్తారు.

మందేశ్వర (శనీశ్వర స్వామి) ఆలయంలో యధావిధిగా పూజా కార్యక్రమాలు:

దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం మందపల్లి శనీశ్వర స్వామి ఆలయంలో యధావిధిగా పూజా కార్యక్రమాలతో పాటు స్వామి వారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి అనుమతులు లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సింగం రాధా తెలిపారు, కోవిడ్ 19 కారోనా వైరస్ సందర్భంగా గత కోన్నినెలల నుండి ఆలయంలో స్వామివారి అభిషేకములు పూజా కార్యక్రమాలను రద్దు చేసి ఆన్లైన్లో మాత్రమే పూజా కార్యక్రమాలను స్వామివారికి అభిషేకములు చేయడం జరిగిందని ఆమె తెలిపారు, అయితే ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు అరుపు ఇకనుండి

స్వామివారి ఆలయంలో యధావిధిగా పూజా కార్యక్రమాలను అభిషేకములు స్వామివారి దర్శనములు చేసుకునేందుకు కొద్దిపాటి వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు,

పురాణ గాథ

పూర్వం అశ్వత్థ,; పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి భక్షించేవారు. అప్పుడు వారంతా వెళ్ళి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో మొరపెట్టుకున్నారు. వారి మొరను ఆలకించిన మందుడు ఆ రాక్షసులను హతమార్చాడు. అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించుకొనేందుకు మందపల్లిలో శివాలయాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడు. అప్పట్నుంచీ ఆ ఆలయం శనైశ్చరాలయంగా ప్రసిద్ధి గాంచింది.

స్థల మహాత్యం


పూర్వకాలము అగస్త్యమహర్షి దక్షిణ దిక్కున సత్రయాగమును చేయుటకై గౌతమీ నదీ తీరమునకు చేరి సంవత్సరం సత్రయాగము చేయుటకు దీక్షితుడయెను. ఆ సమయమున కైటభుడనే రాక్షసుని కొడుకులగు ధర్మకంటకులయిన అశ్వర్ధుడు, పిప్పలుడు యను యిరువురు రాక్షసులు దేవలోకంలో కూడా ప్రసిధ్ధి చెందినవారై యుండిరి. వారిరువురిలో అశ్వర్ధుడు రావిచెట్టు రూపములోనూ, పిప్పలుడు బ్రాహ్మణరూపములోను యుండి సమయము జూసి యజ్ఞమును నాశనం చేయుటకుపక్రమించిరి. వారిలో రావిచెట్టు రూపములోనున్న అశ్వర్ధుడు ఆ వృక్షం నీడలో ఆశ్రయం పొందు బ్రాహ్మణులను దినుచుండెను.పిప్పలుడు సామవేదము నేర్చుకొనుటకు వచ్చిన శిష్యులను తినుచుండెను. అంతట దిన దినము బ్రాహ్మణులు క్షీణించుటను చూచి వృద్ధులగు మహర్షులు గౌతమీ దక్షిణ తటాకమున నియత వ్రతుడై తపస్సు నాచరించుచున్న సూర్యపుత్రుడగు శనిని చూచి ఈ ఘోరమగు రాక్షస కృత్యములను నివేదించి, ఈ రాక్షసుల నిరువురిని వధించమని కోరిరి. అప్పుడు ఆ శని ఋషులతో నిట్లు పలికెను. దానికి శనిదేవుడు తన తపస్సు పూర్తి కాగానే వారిని వధించెదనని మాట యిచ్చెను. దానికి మహర్షులు తమ తపస్సును శనికి యిచ్చెదమని సంహరించమనీ ప్రార్థించిరి. అంతట శని బ్రాహ్మణ వేషమున దాల్చి వృక్షరూపముగ నున్న అశ్వర్ధుని వద్దకు వెళ్ళి ప్రదక్షిణములు చేయనారంభించెను. అంతట అశ్వర్ధుడు రాక్షసుడు ఈ శనిని మామూలు బ్రాహ్మణుడే యనుకుని అలవాటు చొప్పున మ్రింగివేసెను. అప్పుడు శని ఆ రాక్షసుని దేహమున ప్రవేశించి రాక్షసుని ప్రేవులను త్రెంచివేసెను. వెంటనే అతడు భస్మీభూతుడయ్యెను.ఆ వెంటనే బ్రాహ్మణ వేషమున గల రెండవ రాక్షసుడగు పిప్పలుని వద్దకు సామవేదము అభ్యసించుటకు వచ్చినానని బ్రాహ్మణ వటరూపమున శిష్యుని వలె వినయపూర్వకముగా వెళ్ళెను. అంతట ఆ పిప్పలుడు ఈ సూర్య పుత్రుడగు శనిని అలవాటు ప్రకారముగా భక్షించెను. అంతట శని ఆ రాక్షసుని ప్రేవులు కూడా చూచిన మాత్రముననే ఆ రాక్షసుడు భస్మమాయెను.

ఆ యిరువురు రాక్షసులను సంహరించిన శనికి మహర్షులందరూ వరములనిచ్చిరి. సంతుష్టుడై శని గూడ బ్రాహ్మణులతో నిట్ల పలికెను.

నా వారము ఏ జనులైతే నియతవ్రతులై అశ్వత్ధవృక్షమునకు ప్రదక్షిణము చేయుదురో వారి కోరికలన్నియు నీరేడును. వారికి నా పీడ కలగదు. ఈ అశ్వత్థ తీర్థమున ఈ శనైశ్చర తీర్ధమున ఎవరైతే స్నానము చేయుదురో వారు సమస్త కార్యములు తీర్ధములు నిర్విఘ్నముగా కొనసాగును. శని వారము రోజున అశ్వద్ధ ప్రదక్షిణములు చేసిన వార్కి గ్రహపీడ కలుగదు. ఈ తీర్ధమునందు స్నానదానము చేసిన హేమదాన ఫలము లభించును అని శని వరములను యిచ్చెను. అప్పటి నుండి ఈ ప్రదేశములో అశ్వత్థ తీర్థము, పిప్పళ తీర్ధము, సానుగ తీర్ధము, అగస్త్యతీర్ధము, సాత్రికతీర్ధము, యగ్నిక తీర్ధము, సాముగ తీర్ధము నొదలగుగా గల పదునాలుగువేల నూట ఎనిమిది తీర్ధములు అనేకమంది ఋషులచేతను, దేవతల చేతను, కల్పించబడి ప్రసిద్ధి చెందిన స్నాన జపపూజాదులను స్వల్ప భక్తజనులకు సమస్త కార్యసిద్ధులు చేకూర్చిన సతయాగ ఫలము లభింపచేయుచున్నవి.

యిచ్చట ఈశని సామగాన కోవిదులగు బ్రాహ్మణ సంతతి వారగు రాక్షసులను సంహరించి బ్రహ్మ హత్య దోష పరిహారముకై లోక సంరక్షణకై సర్వలోకేశ్వరుడగు సర్వదురిత సంహారకుడగు, కరుణామయుడగు శివుని ప్రతిష్ఠ చేసెను. తనచే ప్రతీష్టింపబడిన శివునికి నువ్వులను అభిషేకము జరిపించిన వార్కి సమస్త కోరికలు నీడేరునట్లుగను తన బాధ యితర గ్రహపీడ మొదలైనవిలేకుండునట్లగను శని వరములు నిచ్చెను. అంతట శనిచే ప్రతిష్ఠింపబడిన ఈశ్వరునికి శనేశ్వరుడనియు కూడా ప్రసిద్ధ నామాంతరము కలిగెను. పిమ్మట ఈ మందేశ్వరునికి ప్రక్కనే సప్తమాత్రుకలు వచ్చి శ్రీ పార్వతిదేవిని ప్రతిష్ఠించిరి. ఈ ఈశ్వరునికి బ్రహ్మేశ్వరుడని పేరు. దీనికి ప్రక్కనే అష్ట మహానాగులలో ఒకడగు కర్కోటకుడను నాగుచే ప్రతిష్ఠింపబడిన ఈశ్వరునికి నాగేశ్వరుడని పేరు. ఈ పక్కనే సప్త మహర్షులలో నొకడగు గౌతమి మహర్షిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ వేణుగొపాలస్వామి మూర్తి ఉంది. మొత్తము మీద ఒకే పెద్ద ప్రాకారములో వరుసగా ఐదు దేవాలయములు కలిగి భక్తి జనాహ్లాదకరముగా నుండును. పూజాతత్పరులకు సమస్త భక్తులకు సమస్త కోరికలు నీరేడుటయే గాక అంత్య కాలములో మోక్షసామ్రాజ్యము నొందెదురు.

Total Page Visits: 157 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed