శనిశింగణాపూర్

1 min read

శనిశింగణాపూర్

అహమద్ నగర్ జిల్లాలో , షిరిడి మరియు ఔరంగాబాద్ మహారాష్ట్ర మధ్యలో శని శింగణాపూర్ అనే శనిక్షేత్రం ఉంది. ఇక్కడ శని *”స్వయంభు” (సంస్కృతంలో స్వయముగా ఆవిర్భవించిన అని అర్థం). భూమి నుండి స్వయంగా ఉద్భవించిన నల్లని , గంభీరమైన రాతి విగ్రహం. కచ్చితంగా ఏ కాలానికి చెందినదో ఎవరికీ తెలియనప్పటికీ, స్తలపురాణం ప్రకారం స్వయంభు శనీశ్వరుడు అనాదిగా ఇక్కడ కొలువైయున్నాడు. కనీసం కలియుగం ప్రారంభం నుండి దీని ఉనికి ఉన్నట్టుగా భక్తులు నమ్ముతారు. నోటిమాట ద్వారా తరతరాలకు అందించబడిన ఈ స్వయంభు , గురించి

స్ధలపురాణంప్రకారం:

పూర్వం , ఒక గొర్రెల కాపరి పదునైన చువ్వతో ఒక చోట మట్టిని తవ్వుతుండగా అది ఒక రాతికి కొట్టుకుని , ఆ రాయి నుండి రక్తం స్రవించడం ప్రారంభమైంది. దీనితో గొర్రెల కాపరులు దిబ్రాంతి చెంది , భయంతో వూరిలోకి పరుగున వెళ్ళి అందరికి తెలిపాడు. వెంటనే పల్లె మొత్తం ఆ అద్భుతం చూచేందుకు గుమికూడి చర్చించుకున్నారు. కానీ ఎవ్వరికీ ఏమీ పాలు పోలేదు. ఆ రాత్రి, ఆ గొర్రెల కాపరి స్వప్నంలో శనీశ్వర స్వామి ప్రత్యక్షమైనాడు. తాను “శనీశ్చరుడి”నని, అద్వితీయముగా కనిపించుచున్న ఆ నల్లరాయి తన స్వయంభు రూపమని తెలిపినాడు. అంతట , ఆ గొర్రెలకాపరి స్వామిని ప్రార్థించి తాను స్వామికి ఆలయం ఎక్కడ , ఎలా నిర్మించాలో తెలుపమని ప్రార్తించాడట. దీనికి సమాధానముగా శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని , కాబట్టి ఏ ఆలయనిర్మాణమూ అక్కరలేదని , ప్రతినిత్యం పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా ‘తైలాభిషేకం’ చేయమని చెప్పాడట. తను స్వయంభుగా వెలసిన ఆపల్లెకు ఇకమీదట బందిపోటుల , దోంగల , దోపిడిదారుల , కన్నము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండజాలదని మాట ఇచ్చి అదృశ్యం అయ్యాడట. ఇక్కడ శనీశ్చర స్వామిని , గుడిలో కాకుండా ఎటువంటి కప్పు లేని ఆరు బయట చూడవచ్చును. ఆంతేకాదు ఈ వూరిలో నేటికీ , (ఈ కలియుగంలో కూడా) ఏ ఇంటికి తలుపు లుండవు! దుకాణాలకు , ఇళ్ళకు , ఆలయాలకు , చివరికి ప్రభుత్వకార్యాలయాలకు కూడా తలుపులు ఉండవు!. ఈ వూళ్ళో ఉన్న తపాలా కార్యాలయానికి కూడా తలుపులు , తాళాల లేకపోవడం మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. శనీశ్వరుడిని భగవానుని యందు భయముచే , శనిభగవానుని ఆలయము వద్ద ఒక కిలోమీటరు వ్యాసార్థం లోపల ఉన్న నివాస స్థలములు , గుడిసెలు , దుకాణములు మొదలైనవాటి వేటికి తలుపులు కాని తాళాలు కాని ఉండవు. శింగణాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడి జరగలేదు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకుని చనిపోయారు. ఇతరులు చాలామంది దీర్ఘకాల అనారోగ్యం , మానసిక సమతుల్యత లేకపోవడం వంటి వివిధ రకాల శిక్షలు అనుభవించారు. శనీశ్వరుని కృపకు పాత్రులు కావాలనుకునే వేలమంది భక్తులు ప్రతిరోజూ ఈ శని శింగణాపూర్ లోని శనీశ్వరుడి దర్శనం చేసుకుంటారు. శనివారములలో ఈ స్థలం చాల రద్దీగా ఉంటుంది. శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించ బడుతుంది. అదే విధంగా ‘అమావాస్య రోజున వచ్చే శనివారం శనీశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణింప బడుతుంది. ఆయన దీవెనల కోసం వేలమంది భక్తులు ఈ ఆలయం వద్ద గుమికూడతారు.

Total Page Visits: 117 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed