ఘనంగా ప్రారంభమైన నాగసర్ప గణపతి ప్రతిష్ట పూజలు

1 min read

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ లో గల శ్రీ షణ్ముఖ పీఠం,శ్రీ సిద్ది సుబ్రమణ్యేశ్వర స్వామి దేవాలయం లో బుధవారం నాగ సర్ప గణపతి ప్రతిష్ట వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా వేద పండితులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గోపూజ,గణపతి పూజ, స్వస్తివాచనం,అంకురారోపణ, రక్షబంధనం,యాగ శాల ప్రవేశం,మంటపశోడన ఉపచారపూజలు,హోమం, వేదపారాయణం నిర్వహించారు.ఈ సందర్భముగా దేవాలయ వ్యస్థాపక అధ్యక్షులు వేద పండితులు ముళ్ళపూడి వెంకట దుర్గా ప్రసాద రావు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని నాగ సర్ప గణపతి విగ్రహ ప్రతిష్ఠ ను సూర్యాపేట లోని సుబ్రమణ్య స్వామి దేవాలయం లో ప్రతిష్ట చేస్తున్నట్లు తెలిపారు. ఈ స్వామి వారిని పూజి0చడం వలన సకల గ్రహ దోషాలు తొలగి పోవునని తెలిపారు.గురువారం ఉదయం 7గంటల 15 నిమిషములకు శతాభిషానక్షత్ర యుక్త వృషభ లగ్న పుష్కరా0శమున శ్రీ నాగ రూప సర్ప గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నందున భక్తులు కరోన నిబంధనలు పాటిస్తూ ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పగిళ్లశ్రీనివాసు,ఆకారపు రమేష్,రంగు.ముత్యం రాజు,ఆనంతుల కిరణ్,సత్యనారాయణ, తుడి శ్రీనివాసు, బాల్ రెడ్డి,ప్రమోద్ రెడ్డి,వినోద్, నరేష్ కుమార్ అర్చకులు ఆదినారాయణ శర్మ,దుర్గా ప్రసాద్ శర్మ,వెంకటరమణ శర్మ,పవన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Total Page Visits: 48 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed