కోదండ రామునికి పౌర్ణమి కళ్యాణం

1 min read

కోదండ రామునికి పౌర్ణమి కళ్యాణం

DATE 26-05-21

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో
వైశాఖ పౌర్ణమి సందర్భంగా టీటీడీ
ఆధ్వర్యంలో కోదండ రాముని
కళ్యాణం ఆగమశాస్త్రం ప్రకారం
సీతారాముల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులుఆలయంలోని రంగ మండపంలో వేదిక ఏర్పాటు చేసి, సీతారాముల ఉత్సవమూర్తులను వేరువేరుగా కొలువుదీర్చారు. అనంతరం
సీతారాములను సుగంధ ద్రవ్యాలతో
పాలు, పెరుగు, తేనె, నెయ్యి,
కొబ్బరినీళ్ళతో అభిషేకం
నిర్వహించారు. నూతన పట్టు
వస్త్రాలను ధరింపజేసి, తులసి
గజమాలతో ప్రత్యేకంగా
అలంకరించారు. అనంతరం ఆలయ
అర్చకులు కోదండరామ స్వామికి
వైభవంగా పౌర్ణమి కళ్యాణం
నిర్వహించారు. భౌతిక దూరం
పాటిస్తూ రాములోరి కళ్యాణాన్ని
భక్తులు తిలకించారు.

Total Page Visits: 113 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed