SGS TV Telugu

24×7 News

పశ్చిమ గోదావరి జిల్లాలో కోన్ని వార్తలు

1 min read

తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దొంగ గెలుపు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు

ఎనిమిది మంది క్రికెట్ బుకీ అరెస్టు
ఐపీఎల్ క్రికెట్ పందాలు నిర్వహిస్తున్న 8 మంది క్రికెట్ బుకీ లను ఆకివీడు ఎస్సై వీరభద్ర రావు ఆదివారం అరెస్టు చేసి కోర్టుకు పంపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ పోటీలో క్రికెట్ పందాలు నిర్వహిస్తున్న ఎనిమిది మంది క్రికెట్ బుకీ లను ముందస్తు సమాచారం మేరకు దాడులు చేసి అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుండి 8 సెల్ పో న్లు, ఐప్యాడ్ రూ లక్షా పాతిక వేలు నగదు స్వాధీనపరచు కున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా క్రికెట్ పందాలు నిర్వహిస్తే దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు.

add

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు ధర్న

ధాన్యం కొనుగోలు చేయాలని చింతలపూడి నియోజకవర్గం రాఘవాపురంలో రోడ్డు పై రైతులు ధర్నా చేపట్టారు. వివరాలలోకి వెళితే చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన రైతులు పంట వేసేటప్పుడు వ్యవసాయాధికారులను సంప్రదించగా 1153 రకం ధాన్యం పండించమన్నారని వాళ్ళ ఆదేశాలు ప్రకారం 1153 రకం పంట పండించామని ఇప్పిడు పంట కోసి 20 రోజులు అవుతున్న అధికారులు కోనడం లేదని అడిగితే 15 రకం ధాన్యం ముక్కలు అవుతుందని అంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఏడిద శ్రీనివాస్ కు మాతృవియోగం

నర్సాపురం పట్టణానికి చెందిన అత్తిలి సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహశీల్దార్ ఏడిద శ్రీనివాస్ తల్లి బంగారులక్ష్మీ అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందారు. ఈమెకు ఇరువురు కుమారులు శ్రీనివాస్, దొరబాబు తో పాటు ఒక కుమార్తె కలరు. నర్సాపురం పాతబజార్ లోని స్వగృహంలో శ్రీనివాస్, దొరబాబులను పలువురు ప్రముఖులు, శ్రేయోభిలాషులు, నాయకులు, అధికారులు, బంధుమిత్రులు కలిసి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే కొలుకోవాలంటూ ప్రత్యేక పూజలు

కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతున్న చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా త్వరగా కొలుకోవాలంటూ జంగారెడ్డిగూడెం పట్టణం నుకాలమ్మ ఆలయంలో వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ నాయకులు బత్తిన చిన్న వార్డు

కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ప.గో..
ఏలూరులో పత్తేబాధ లోని ప్రభ ఆసుపత్రి వద్ద రోగుల ఆందోళన

కరోనా ఆసుపత్రిగా గుర్తింపు రావడంతో ఇన్ పేషేంట్లను డిశ్చార్జ్ చేస్తున్న యాజమాన్యం

ఇప్పటికిప్పుడు డిశ్చార్జ్ చేస్తే ఏ ఆసుపత్రికి వెళ్తామంటూ రోగుల ఆందోళన

కరోనా టెస్ట్ ఫలితం లేకుంటే ఏ ఆసుపత్రిలో కూడా సాధారణ ట్రీట్మెంట్ లేదంటూ ఆవేదన

ఉన్నతాధికారులు స్పందించాలని, తమకు ప్రభ ఆసుపత్రిలో వైద్యం పూర్తి చేయించాలని డిమాండ్

జూమ్ యాప్ ద్వారా జిల్లా ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్

ఏలూరు: జిల్లా ఎస్పీ కె. నారాయణ నాయక్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నివారణ కోసం పోలీస్ అధికారులు పాటించవలసిన నియమ నిబంధనలు, వైద్య పరమైన సూచనలను ఎస్పి యూనిట్ డాక్టర్ జి.దీప అవగాహన కల్పించారు.

నిడదవోలుపట్టణంలో.కోవిడ్.విస్తరణప్రమాదఘంటికలు వెంటనే.యుద్ధప్రాతిపదికన.కోవిడ్ కేర్.సెంటర్ లేదా.సామాజికఆరోగ్యకేంద్రాన్ని కోవిడ్ హాస్పటల్ గామార్చాలని.క్వారంటైన్ కేంద్రాన్నిఏర్పాటుచేయాలని.సీపీఎం.నాయకులుజువ్వలరాంబాబుప్రభుత్వాన్ని డిమాండ్.చేశారు.సీపీఎంతరపునఒకప్రకటనవిడుదలచేసారు.ఈరోజుఒక్కరోజే.పట్టణంలోసుమారు70కేసులునమోదుఅయ్యాయి బాధితులుఅత్యధికులు పెద్దవాళ్ళు.మధ్యతరగతివాళ్ళు.నిడదవోలులో.ఐషోలేషన్.పేరుతో.చాలామందినిఇళ్లల్లోఉంచేస్తున్నారురాత్రుళ్ళుఇబ్బందులువస్తేఇకవాళ్ళబాధలువర్ణానాతీతం.ప్రైవేట్ హాస్పిటల్కి.వెళ్ళితే.లక్షరూపాయలు.డిపాజిట్.చెయ్యమంటున్నారు పెద్దవాళ్ళపరిస్థితిఏంటి?ప్రభుత్వఅంబులెన్స్ అందుబాటులోలేకపోతే ప్రైవేట్.అంబులెన్స్.కి.వేలాదిరూపాయలు.వెచ్చించాలసివస్తోందని.ప్రజలుఆందోళనచెందుతున్నారు.ఎందుకు?టౌన్లో.ప్రభుత్వకోవిడ్ కేంద్రాన్నిఏర్పాటు.చెయ్యలేకపోతున్నారు.నియోజకవర్గకేంద్రం.MLAగారు.ప్రయత్నిస్తే.ఏర్పాటుచెయ్యలేరా.వైద్యంఅందకమరణించేవారికికుటుంబాలకు.ప్రజాప్రతినిధులుబాధ్యతవహించాలి.రాజకీయపక్షాలుస్వచ్ఛందసంస్థలు.సహకారంతీసుకొని.కోవిడ్.కేంద్రం.క్వారంటైన్.ఏర్పాటుపై.కేరళనమూనా.అఖిలపక్షం.ఏర్పాటుచేసి.కట్టడిచేసేందుకుచర్యలుతీసుకోవాలని.వెంటనేఅన్నిపక్షాలతోసమావేశంనిర్వహించి.సహకారంతీసుకోవాలని.సీపీఎం.డిమాండ్ చేస్తుంది

తణుకులో ఒక్కరోజులో 50 పాజిటివ్ కేసులు

తణుకు పట్టణంలో ఆదివారం ఒక్కరోజులోనే 50 కరోనా కేసులు నమోదయినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు బాధితులు హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

నిడదవోలు విద్యాదీప్ మేడమ్ గారు అకాలమరణంకుచింతిస్తున్నాము మీకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నాను మేడమ్ గారు

sgstvtelugu. com మేనేజ్మేంట్

ఆదూరి భాను ప్రకాష్

VJ ఫుడ్ కోర్టు మీద నిడదవోలు

గిరి పేరు వర ప్రసాద్ &కోయి విజయ

Total Page Visits: 160 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *