విశాఖ జిల్లా నర్సీపట్నం కరోనా వేళ ఏపీలో అతి పెద్ద డ్రగ్ స్కామ్

1 min read

నర్సిపట్నం

కాలం చెల్లిన మందులు పంపిణీ చేస్తున్నారని బాధితులు ఆస్పత్రి వద్ద అర్ధరాత్రి ఆందోళన..!!

ఒక ఇంజెక్షన్ ఖరీదు 4800 రుపాయులు మరి
వందల కొద్ది ఇంజక్షన్ కి ఎంత ఖరీదైన ఉంటదో చెప్పనక్కర్లేదు

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం కోసం కొంతమంది
డ్రగ్ తయారీ కంపెనీలతో
ఒప్పందం ఏర్పాటు చేసుకున్నారని ఎక్స్ పెయిడ్ అయిపోయిన మందులు పేషెంట్లకు అందిస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు….

నర్సీ పట్నం ఏరియా హాస్పిటల్‌లో రోగులకు గడువు ముగిసిన రెమిడీసివర్స్ ఇంజక్షన్ ఇవ్వడంతో, కోపంతో ఉన్న రోగుల బంధువులు ఆస్పత్రి వద్ద సిబ్బందిని నిలదీశారు…

పలువురు ఆస్పత్రి సిబ్బంది నిలదీసి కలిసి ఫార్మసీ విభాగానికి చేరుకుని సంబంధిత అధికారులను స్టాక్ చూపించాలని డిమాండ్ చేశారు…..

దీంతో హాస్పిటల్ లో గొడవ జరుగుతున్నా విషయం పట్టణ పోలీసులకు చేరడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, భాదిత సభ్యులను మరియు అక్కడ ఉన్న జనాలను చెదరగొట్టారు…..

ఒక్కో ఇంజక్షన్ 4,800 రూపాయలు కి కొనుగోలు చేసి ఏరియా ఆస్పత్రిలో పేషెంట్లకు కి అందించడం జరుగుతుంది….

గడువు తీరిన మందు ఏవిధంగా పంపిణీ చేస్తారని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి సూపర్డెంట్ ని బాధితులు ఫోన్లో ప్రశ్నించగా జిల్లా వైద్య శాఖ అధికారి డిఎంఅండ్హెచ్ఓ
ఈ మందులు మాత్రమే వాడమని ఆదేశాలు జారీ చేశారని ఆయన ఫోన్లో తెలియజేశారు…..

నర్సీపట్నం లో జరుగుతున్న మందులు విషయంపై జిల్లా వైద్య శాఖ అధికారిని ఫోన్ లో ప్రశ్నించగా ప్రభుత్వం అదే మందులు జారీ చేసిందని మా దగ్గర ఆర్డర్ కాపీ ఉందని జిల్లా మొత్తం కూడా ఈ కాలం చెల్లిన మందులు పై స్టిక్కర్లు వేసి పంపిణీ చేస్తున్నామని తెలిపుతు మాట దాటవేశారు..

ఫోన్ చేసిన వ్యక్తి పై చిరాకుగా మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశారు…. ప్రజల ప్రాణాలు కాపాడడానికి వచ్చాడండి మగాడు అంటూ
వంకరగా మాట్లాడారని బాధితులు ఆరోపణ చేశారు…

మార్చి నెల నాటికి కాలం చెల్లిన మందులు జిల్లా అంతా పంపిణీ చేశారంటే , ఇందులో ఎంతమందికి అధికారులు నాయకులు కు ప్రమేయం ఉందోనని బాధితులు ఆరోపణలు చేస్తున్నారు…

ఒక ఇంజక్షన్ 4800 ఖరీదు
జిల్లా మొత్తం సుమారు పదివేల ఇంజక్షన్లు రావడం జరిగిందని జిల్లా వైద్య శాఖ అధికారి మాటల్లో వినిపిస్తుంది……

డ్రగ్ కంపెనీ తో కలిసి పలువురు ఒప్పందం ఏర్పాటు చేసుకొని ఈ మందు రోగులకు అందిస్తున్నారని బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి….

ఈ మందులు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు
విచారణ జరపాలని పలువురు కోరుతున్నారు…..

Total Page Visits: 80 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed