_జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్య వైఖరిపై ఎంపి భరత్ ఆగ్రహం

1 min read

మరీ ఇంత నిర్లక్ష్యమా?!

_జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్య వైఖరిపై ఎంపి భరత్ ఆగ్రహం

_జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

రాజమహేంద్రవరం, మే 27:

సాక్షాత్తూ ఎంపి చెప్పినా పట్టించుకోకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటంటూ కాకినాడ జీజీహెచ్ వైద్యాధికారులపై రాజమహేంద్రవరం ఎంపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

మూడు రోజుల క్రితం బ్లాక్ ఫంగస్ వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తికి మెరుగైన వైద్య సహాయం అందజేయమంటూ కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ కు ఎంపి భరత్ ఫోన్ ద్వారా కోరారు.

అయితే సదరు రోగికి గత మూడు రోజులుగా బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు అవసరమైన వైద్యం చేయడం లేదంటూ పేషెంట్ భార్య గురువారం ఎంపి భరత్ రామ్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు.

దీంతో వెంటనే జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డికి ఎంపి ఫోన్ చేసి బ్లాక్ ఫంగస్ బాధితులకు ఇంజక్షన్ల కొరత ఏమైనా ఉందా అని అడిగారు.

కాకినాడ జీజీహెచ్ లో బ్లాక్ ఫంగస్ బాధితుల ప్రత్యేక వార్డు బెడ్ నెంబరు 8 పేషెంట్ మంగరాజు ఆరోగ్య పరిస్థితిపై ఎంపి భరత్ రామ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ స్వయంగా తాను చెప్పిన వైద్యులు పట్టించుకోకపోవడాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు.

రాజమహేంద్రవరం నగరంలోని మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో గల ఎంపి కార్యాలయంలో గురువారం నిర్వహించిన రాజన్న రచ్చబండ కార్యక్రమంలో పేషెంట్ మంగరాజు భార్య వైద్యుల నిర్లక్ష్యంపై ఎంపి భరత్ రామ్ కు ఫిర్యాదు చేశారు. తన భర్తకు ప్రాణ భిక్ష ప్రసాదించాలంటూ విలావిలా ఏడుస్తూ ప్రాధేయపడింది.

దీంతో ఆమె పరిస్థితికి ఎంపి భరత్ తీవ్రంగా చలించిపోయారు.

మూడు రోజులుగా తాను పదేపదే చెబుతున్నా ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారంటూ ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు.

వెంటనే జిల్లా కలెక్టర్ మురళీ ధర్ రెడ్డి కి ఫోన్ చేసి జరిగిన విషయమంతా వివరించారు.

అటు నుంచి పేషెంట్ వివరాలు పంపమని కలెక్టర్ అడగగానే ఫోన్ ద్వారా ఎంపి వివరాలు పంపించారు.

అనంతరం కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ కు ఎంపి భరత్ ఫోన్ చేసి మాట్లాడారు.

ఎంపి ఫోన్ చేస్తే కూడా మీరు స్పందించారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూడు రోజులుగా బ్లాక్ ఫంగస్ పేషెంట్ మంగరాజు కు ఏ వైద్యం అందించారో నాకు వెంటనే వివరాలు పంపించమని ఆదేశించారు.

కనీసం టాబ్లెట్స్ కూడా ఇవ్వకుండా వైద్యం ఏమి చేస్తున్నారంటూ సూపరింటెండెంట్ వైఖరి పై ఆందోళన చెందారు.

మరి కొద్ది నిమిషాలకే కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎంపి భరత్ రామ్ కు ఫోన్ చేసి సదరు రోగికి మధుమేహ వ్యాధి ఉండటంతో ఇంజక్షన్లు ఇవ్వడం లేదని చెప్పారు.

సుగర్ లెవెల్స్ తగ్గిన తర్వాత బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు వైద్యం అందజేస్తామని వివరించారు.

ధవళేశ్వరం 17వ వార్డులో నేటికీ సుమారు 50 కుటుంబాలకు రేషన్ అందలేదని పలువురు ఎంపి భరత్ కు ఫిర్యాదు చేశారు.

దీనిపై ఎమ్మెస్వోకు ఫోన్ చేసి వివరాలు అడిగారు. తక్షణం రేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

పలువురు సీఎం సహాయ నిధి నిమిత్తం ఎంపి భరత్ రామ్ కు విన్నవించారు.
గోదావరి రోలర్స్ ఫ్లోర్
మిల్స్ లిమిటెడ్ సంస్థ కరోనా
బాధితుల సహాయార్థం ఎంపీకి 1500 కేజీల గోధుమ పిండి బస్తాలను ఆ సంస్థ సీఈఓ శర్మ అందజేశారు
……………….

Total Page Visits: 32 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed