SGS TV Telugu

24×7 News

హిందూ దేవుళ్ళ ఆస్థి అంటే చులకన భావన, ఇతర మతాలు ఆస్తులు కి జోలికి వెళ్ళే సహాసం చేయగలరా.

1 min read

హిందూ దేవుళ్ళ ఆస్థి అంటే చులకన భావన, ఇతర మతాలు ఆస్తులు కి జోలికి వెళ్ళే సహాసం చేయగలరా.

తణుకు పట్టణంలోని పాతవూరు లోని అత్యంత పురాతన, ఆరాధించే దేవాలయం, పంచ శివ క్షేత్రాల వలే, పంచ కేశవ క్షేత్రాలలో ఒకటి ఆయిన శ్రీ కేశవస్వామి మహలక్ష్మి అమ్మవార్ల దేవస్థానము ఆస్థి పెరవలి రోడ్ లోని ఊరు మధ్యలో ఉండే సుమారు 16 ఏకరాల భూమి పై కొంతమంది కన్ను పడి దానిని అభివృద్ది పేరుతో మొత్తం భూమి కి ఎసరు పెడుతున్నారు. పెట్టటేమి కాదు, కాగితాలు కూడా పై అధికారులు కు పంపిoచారు. అర్చకులు పై ఒత్తిడి చేసి సంతకాలు చెయించెసారు. దేవస్థానం డిపార్టుమెంటు లోని అన్ని స్థాయిలలో అధికారుల పై ఒత్తిడి చేసి వాళ్ళ చేత సంతకాలు చెయించెసారు ఆని తెలుస్తుంది.

మొత్తం భూమి 15.67 పంట పండే భూమి. దీనిపై పూర్తి వివరాలు చూద్దాం..

తణుకు పాతవూరు పెరవలి రోడ్ లో ఉండే ఈ పొలానికి మూడు వైపుల ఊరు, ఒక వైపు జాతీయ రహదారి గల ఈ పొలానికి మార్కెట్ విలువ గజాల లో తీసుకున్న 10 కోట్ల రుపాయాలు పైనే ఉంటుంది, అంటే మొత్తం ఈ పొలం విలువ 160 కోట్లు. ఈ దేవుడి పొలం పై కన్ను వేసి మాయ చేసి దేవుడి కి, అర్చకుల కు లేకుండా చేద్దామని చూస్తున్నారు అంటే…..

134/A 1.73 దేవస్థానం
134/A 4.04 అర్చకులు
134/1B 0.86 అర్చకులు
134/2A 0.72 అర్చకులు
134/2C 8.32 అర్చకులు
మొత్తం పొలం 15 ఎ. 67 సెం.

ఇందులో దూపధీప నైవెధ్యలకు అర్చకుల పోషణ నిమిత్తం 13 ఎ. 94 సెంట్లు అర్చకులది. గుడి అర్చకుల ను ఒత్తిడి చేసి వాళ్ళ చేత కాగితాలు వ్రాయించుకున్నరని తెలుస్తుoది. ఆర్చకుల కింద ఉన్న 13.94 ఎకరాలలోని 10 ఎకరాలు లలో హాస్పటల్ నిర్మిస్థాము ఆని చెపుతున్నారు. ఈ పది ఎకరాలకు ఎకరానికి 30 వేలు యిస్థామని ప్రభుత్వ ఆసుపత్రి వారు కాగితం వ్రాసి యిస్థారు ఆని అర్చకులకు చెప్పినట్లు తెలుస్తుంది. మిగతా 3 ఎకరాల 94 సెంట్లు, దేవస్థానం కింద ఉన్న 1 ఎకర 73 సెంట్లు వెరశి మొత్తం 5 ఎకరాల 67 సెంట్లు పొలం లో వేలం పాట వేసి షాపులు నిర్మిస్తాము ఆని చెపుతున్నారు.

దేవస్థానం భూమి ని ఇలా మార్చటానికి ఏమి హాక్కు ఉందని దేవుని భక్తులు ప్రశ్నిస్థున్నారు.

అర్చకులు మాత్రం వీళ్ళ ఒత్తిడులకు తలొగ్గి ఏమి మాట్లాడలేకపోతున్నారు.

ఊరు మధ్యలో ఉండే దేవుడి పొలం ఇలా అన్యాక్రాంతం అవుతూంటే చూస్తూ ఉంధామా, దీనిపై అందరం కలిసి పొరాటం చేద్దామా.

యిదే ఊరిలో సజ్జాపురం శివాలయం భూమి అప్పట్లో కాలేజి కి లీజు కి యిచ్చి ఇప్పటి వరకు ఏమైనా అద్దె యిస్థున్నారా. ఇప్పుడు ఉండే నాయకులు రేపు ఉండకపోవచ్చు, ఇప్పుడు ఉండే అధికారులు రేపు ఉండకపోవచ్చు. కాని దేవుడి ఆస్థి ని అన్యాక్రాంతం చేసి చేతులు ధులుపుకుని వెళ్ళిపోతే భవిష్యత్ లో దేవాలయం పరిస్థితి ఏమిటి ఆలోచించండి. ఏమైనా సరే అడ్డుకోవాలి. అందరం అడ్డుకోవాలి.

హిందూ దేవాలయ పరిరక్షణ సమితి వారి పోరాటం లో మనం మనం గొంతు కలుపుధాo, వారి పోరాటానికి మనం మద్దతు పలుకుధాo.

  • శ్రీ కేశవస్వామి మహాలక్ష్మి ఆమ్మవార్ల దేవస్థానాన్ని కాపాడుదాo, దేవస్థాన ఆస్థి, అర్చకుల ఆస్థి ని కాపాడుదాo.*

వీళ్ళ దుర్బుద్ధి ని ప్రజలకు తెలియజెద్దాం, ప్రజా ఒత్తిడి తో వాళ్ళ అలోచన లో మార్పు తీసుకొద్దాo

హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి.
తణుకు.

Total Page Visits: 10 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *