హాస్పిటల్స్ లోపెషేంట్స్ నుండి అడ్డగోలు వసూళ్లు పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్

1 min read

పశ్చిమగోదావరి జిల్లా…29.5.2021…

స్క్రోలింగ్ ప్లీజ్…

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కోవిడ్ హాస్పిటల్స్ లోపెషేంట్స్ నుండి అడ్డగోలు వసూళ్లు పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్…

ఆరోగ్య శ్రీ పెషేంట్స్ నుండి లక్షలు వసూళ్లు చేస్తున్న ప్రవేట్ హాస్పిటల్స్ పై కఠినంగా వ్యవహారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేశించినట్టు మంత్రి ఆళ్ల నాని వెల్లడి…

ఆరోగ్య శ్రీ కార్డ్స్ ఉన్న అడ్వాన్స్ పేమెంట్స్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని
జిల్లా యంత్రాంగానికి మంత్రి ఆళ్ల నాని అదేశం…

కోవిడ్ పెషేంట్స్ నిలువు దోపిడీ పై మీడియా లో వస్తున్న వరస కధనలపై తీవ్రంగా స్పందించిన మంత్రి ఆళ్ల నాని…

ఆరోగ్య శ్రీ పేరుతో పెషేంట్స్ నుండి లక్షలు గుంజుతున్న హాస్పిటల్స్ పై ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ టీమ్ వేసి తనిఖీలు నిర్వహించాలని DMHO డాక్టర్ సునంద ను అదేశించిన మంత్రి ఆళ్ల నాని…

జిల్లా వ్యాప్తంగా కోవిడ్ ప్రవేట్ హాస్పిటల్స్ విజిలెన్స్ టీమ్స్ తనిఖీలు ముమ్మరం చేయాలని మంత్రి ఆళ్ల నాని అదేశం…

ప్రవేట్ హాస్పిటల్స్ లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కంటే అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ కేసులకు కూడ వెనుకడవద్దని ముఖ్యమంత్రి అదేశించారు…

ఆరోగ్య శ్రీ కింద అందించే సేవలకు పెంచిన ఫీజులనే ప్రభుత్వం చెల్లిస్తుంది…

ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కంటే అధికంగా వసూలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించిన మంత్రి ఆళ్ల నాని…

ప్రవేట్ హాస్పిటల్స్ లో అధిక రేట్లు నియంత్రణ, నిబంధనలు ఖచ్చితంగా అమలు కావాలని మంత్రి ఆళ్ల నాని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అదేశం…

ప్రతి కోవిడ్ ప్రవేట్ హాస్పిటల్స్ లో సీసీ కెమెరా లు, ఆరోగ్య మిత్రలు సమర్ధవంతంగా పని చేయడానికి అధికారులు ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని మంత్రి ఆళ్ల నాని అదేశం…

కోవిడ్ హాస్పిటల్స్ కు నియమించిన నోడల్ ఆఫీసర్స్
ప్రవేట్ హాస్పిటల్స్లో అధిక ఫీజులపై ద్రుష్టి పెట్టాలి…

దాడులు చేసిన తర్వాత కూడ అధికంగా కోవిడ్ పెషేంట్స్ నుండి ఫీజులు వసూలు చేస్తే జిల్లా కలెక్టర్ కఠినంగా వ్యవహారించాలని మంత్రి ఆళ్ల నాని సూచన…

కోవిడ్ మహమ్మారి సమయంలో మానవత్వంతో ప్రవేట్ హాస్పిటల్స్ వ్యవహారించాలి…

ప్రతి పేద వాడికి, ప్రతి రోగికి ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందాలి…

ఎక్కువగా ఫీజులు వసూలు చేసే ప్రవేట్ కోవిడ్ హాస్పిటల్స్ పై కఠిన చర్యలకు వెనుకాడ వద్దు…

పదే పదే తప్పులు చేస్తూ ఆరోగ్య శ్రీ పెషేంట్స్ నుండి ఫీజులు వసూలు చేస్తున్న కోవిడ్ ప్రవేట్ హాస్పిటల్స్ పై క్రిమినల్ కేసులు నమోదుకు వెనుకాడ వద్దని ముఖ్యమంత్రి అదేశించారని వెల్లడించిన మంత్రి ఆళ్ల నాని…

ఎంప్యానల్ చేసిన ప్రవేట్ హాస్పిటల్స్ లో ఖచ్చితంగా 50%బెడ్స్ ఆరోగ్య శ్రీ పెషేంట్స్ కు ఇవ్వాలని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని DMHO డాక్టర్ సునందను అదేచించిన మంత్రి ఆళ్ల నాని…

అన్ని హాస్పిటల్స్ లో ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, బెడ్స్ కొరత ఉన్నట్టు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ఎట్టి పరిస్థితిలో సహించేదిలేదని స్పష్టం చేసిన మంత్రి ఆళ్ల నాని…

జిల్లా వ్యాప్తంగా కూడ RMP వైద్యులు ప్రవేట్ హాస్పిటల్స్ కు కోవిడ్ పెషేంట్స్ ను పంపి కమిషన్ వసూలు చేస్తున్నట్టు వస్తున్న వాటిపై కూడ నిఘా కొనసాగాలని మంత్రి ఆళ్ల నాని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అదేశం…

ప్రభుత్వం నిర్ధారణ చేసిన ధరలకు అనుగుణంగా ప్రవేట్ కోవిడ్ హాస్పిటల్స్ లో ఫీజులు వసూలు చేయకుండా ఉంటే అధికారులు ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలి…

ఆక్సిజన్ బెడ్స్ కోసం ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు పాటించకుంటే చర్యలు కఠినంగా ఉంటాయన్న మంత్రి ఆళ్ల నాని…

కరోనా చికిత్స కోసం ప్రవేట్ హాస్పిటల్స్ లో అడ్వాన్స్ లుగా వేల రూపాయలు వసూలు చేస్తే అలాంటి హాస్పిటల్స్ పై హెల్త్ డిపార్ట్మెంట్ ఆకస్మికంగా తనిఖీలు చేయాలని మంత్రి ఆళ్ల నాని అదేశం…

రెమిడీసివర్ ఇంజక్షన్స్ బ్లాక్ లో విక్రయాలు చేస్తే ఎవరిని వదిలేది లేదని డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు ముమ్మరం చేయాలని మంత్రి ఆళ్ల నాని సూచన…

బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన వారికి కూడ ఆo పో టేరిసిన్ బి ఇంజక్షన్స్ తో పాటు,
కేంద్రం ఇచ్చిన పొసకొనజోల్ ఇంజక్షన్స్ కూడ అందుబాటులో ఉండాలి…

కోవిడ్ పెషేంట్స్ నుండి అధికంగా ఫీజులు వసూలు చేస్తుంటే పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై కూడ చర్యలు ఉంటాయని తెలిపిన మంత్రి ఆళ్ల నాని…

కోవిడ్ పెషేంట్స్ నుండి బెడ్స్ కోసం అధికంగా ఫీజులు వసూలు చేస్తే 104కాల్ సెంటర్ కు పిర్యాదు చేయాలని మంత్రి ఆళ్ల నాని సూచన…


మాణిక్యరావు… ప్రజా సంబంధాల అధికారి… టు… ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి…

Total Page Visits: 15 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed