స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి
14వ_రోజు నిత్యావసర సరుకులు పంపిణీ

1 min read

గుంటూరు:
స్థానిక బ్రాడీపేట 4/9లోని “బ్రాహ్మణ చైతన్య వేదిక” రాష్ట్ర కార్యాలయంలో 8-6-21 మంగళ వారం ఉదయం ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న బ్రాహ్మణ కుటుంబాలకు, ప్రవేట్ టీచర్లకు …. రాష్ట్ర కార్యాలయంలో నిత్యావసర సరుకులను బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు వేంకట శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో “వాస్తు పురుష కొండమడుగు ప్రసాద్ ” చేతుల మీదుగా ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు.
ఈ సందర్భంగా శిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ గుంటూరు నగరం మరియు పరిసర ప్రాంతాల్లో కరోనా వైరస్ కర్ఫ్యూ నేపథ్యంలో పేద,మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు ఆర్థికముగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరే కాక సమాజంలో ఇతర సామాజికవర్గాల వారు అనేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో అటువంటి వారికోసం గుంటూరు నగరంలోని స్వచ్చంద సంస్దలు ఈ కరోనా కష్టకాలంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పేద,మధ్యతరగతి కుటుంబీకులు ఆర్ధికంగా బాగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ నిత్యావసర సరుకులను వారికి అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఆకలికి కులం,మతం,ప్రాంత భేదాలు ఉండవని, ఈ “కరోనా” కారణంగా కొన్ని వర్గాల వారు అనేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న నేపద్యంలో వారికి 3 వారాలకు సరిపోయే నిత్యావసర వస్తువుల్ని బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా “కర్ఫ్యూ” సడలించే వరకు ఈ సహకారం ప్రతిరోజు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొండమడుగు ప్రసాద్, వడ్లమూడి రాజ, వడ్డమాను ప్రసాదు, మతుకుమల్లి సాయి, వేములపాటి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Total Page Visits: 26 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed