SGS TV Telugu

24×7 News

సోమూవీర్రాజు మేనల్లుడు గుండెపోటు తో మృతి…

1 min read


మండపేట:- రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోమూవీర్రాజు మేనల్లుడు, మండపేట మండలం బీజేపీ నాయకులు ముత్యం శ్రీనివాస్ సోమవారం తెల్లవారుజామున గుండెపోటు తో మృతి చెందారు.భారతీయ జనతాపార్టీ మండపేట రూరల్ అధ్యక్షులు ముత్యం శ్రీనువాస్ పనిచేశారు. మండపేట మండలం భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా,ద్వార పూడి మహాత్మాగాంధీ వస్త్ర మార్కెట్ సూపర్వైజర్, మదర్ తెరిసా సేవా సమితి ఉపాధ్యక్షులు, ద్వారపూడి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గా ముత్యం శ్రీనివాస్ సేవలందిస్తున్నారు. ద్వారపూడి గ్రామంలో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించిన ఆయన  సేవలు అమోఘం మని పలువురు పేర్కొన్నారు. పలు కమిటీల తరపున నివాళులు అర్పించారు. వస్త్ర  మార్కెట్ కమిటీ అధ్యక్షులు చిక్కాల శ్రీనివాసరావు , నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్  కోన సత్యనారాయణ, మండల పార్టీ కార్యదర్శి కంకటాల మురళీకృష్ణ , రాయి వీర్రాజు, రాయి ప్రసాద్,ద్వారపూడి అమ్మన్న,ముత్యాల వీర్రాజు చౌదరి,మదర్ తెరిసా సేవా సమితి అధ్యక్షులు గేదెల కిషోర్ ,  గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సాపిరెడ్డి శ్రీను,  మార్కెట్ ప్రముఖులు , గ్రామ ప్రముఖులు గ్రామ ప్రజలు  పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఆయనకు భార్య,కుమార్తె, కుమారుడు ఉన్నారు.  రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మేనల్లుడు మృతి సమాచారం తో విజయవాడ నుండి నేరుగా  ద్వారపూడి విచ్చేసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.  ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరారు .ఆయన పార్దివదేహాన్ని రాజమండ్రి కోటిలింగాల శ్మశానవాటికకు తరలించారు.

Total Page Visits: 76 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *