సర్పంచ్ లకు వెంటనే చెక్ పవర్ ఇవ్వాలి – రాజేంద్ర ప్రసాద్

1 min read

విజయవాడ

ది. 6 – 5 – 2021

సర్పంచ్ లకు వెంటనే చెక్ పవర్ ఇవ్వాలి – రాజేంద్ర ప్రసాద్

👉🏻 మూడు నెలల క్రితం నూతనంగా ఎన్నికైన 12 వేలమంది సర్పంచ్ లకు ఇంత వరకు చెక్ పవర్ ఇవ్వకపోవడాన్ని మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ తీవ్రంగా ఖండిస్తోంది – రాజేంద్ర ప్రసాద్.

👉🏻 కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి 12 వేల గ్రామాల్లో చేపట్టవల్సిన పారిశుద్య పనులకు నిధులు రాక సర్పంచ్ లు ఇబ్బందులు పడుతున్నారు.

👉🏻 cfms ఖాతా క్రింద ఉన్న గ్రామ పంచాయతీ నిధులు మరియు 14, 15 వ ఆర్థిక సంఘం నిధులను సుమారు 3 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన స్వంత అవసరాలకు వాడేసుకుంది – రాజేంద్ర ప్రసాద్.

👉🏻 అందుకే సర్పంచ్ లకు చెక్ పవర్ ఇవ్వడం లేదా?

👉🏻 దీని వల్లన కరోనా నివారణ చర్యలు చేపట్టలేక సర్పంచ్ లు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారు – రాజేంద్ర ప్రసాద్.

👉🏻 గ్రామ పంచాయితీలు నిర్వీర్యం అవ్వడం తో గ్రామీణ ప్రజలు కరోనా బారినపడి చనిపోతున్నారు.

👉🏻 తక్షణమే సర్పంచ్ లకు చెక్ పవర్ ఇచ్చి గ్రామీణ ప్రజల్ని ఆదుకోవాలని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి గార్ని , పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి గార్ని మా ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ ఛాంబర్ డిమాండ్ చేయుచున్నది.

Y.V.B. రాజేంద్ర ప్రసాద్ mlc
అధ్యక్షులు – ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్

Total Page Visits: 61 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed