శవాలపై వ్యాపారం..!!

1 min read

శవాలపై వ్యాపారం..!!

ట్రస్ట్ పేరుతో అత్యక్రియలకు 15 వేల రూపాయల నుంచి 20 వేల వరకు వసూలు..

ఈ మొత్తం నగరపాలక సంస్థకు వెళ్తుందా.. ట్రస్ట్ కు వెళ్తుందా..?

దేశమంతా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా భాదితులు వారి బంధువులు ఆస్పటల్ లో బిల్లులు కట్టలేక ఎంతో వేయ ప్రయాసలు పడుతూ ఆసుపత్రుల యాజమాన్యాలు కి తమకున్న ఆస్తులు అమ్ముకుంటూ బిల్లులు చెల్లిస్తున్న పరిస్తుతులు చూస్తున్నాం. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే.. కరోనా కోరల్లో చీక్కుకొని చనిపోయిన మృతదేహాలు తీసుకోని స్మశానానికి వెళితే అక్కడ కూడా 15 వేల రూపాయల నుంచి 20 వేల వరకు వసూలు చేస్తు నిలువు దోపిడి చేస్తున్నారు.

ఇది ఎక్కడో కాదు గుంటూరు నగరం నడిబొడున ఉండే కోరిటపాడు లోని హిందూ స్మశాన వాటిక లో జరుగుతున్న తంతు..!!

అసలు విషయం ఏమిటంటే.. కోరిటపాడు హిందూ స్మశాన వాటికను చుక్కపల్లి శంకరరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్మశానాన్ని డెవలప్ చేసి కార్యకలాపాలు నిర్వతీస్తున్నారు. అయితే.. కరోనా లాంటి విపత్కర పారిస్థితులో మనిషి బ్రతక పోగా డెడ్ బాడీ కి అత్యక్రియలు చేద్దామని స్మశాన వాటికకు వస్తే ఇక్కడ కూడా 15 వేల నుంచి 20 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని.. తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయానన్న బాధ కన్నా ఇక్కడ చేస్తున్న నిలువు దోపిడీ కి ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. గుంటూరు చుట్టుపక్కల ఉన్న బొంగరాలబీడు, స్తంభాలగరువు స్మశాన వాటికలో దహన సంస్కారాలు చేసినందుకు మూడు వేల రూపాయల నుంచి ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారు. మరి ఇది ఒక కోరిటపాడు స్మశానంలో ఎందుకు జరుగుతుంది. కుటుంబ సభ్యులు చనిపోతే.. పుస్తెలు అమ్ముకొని దహన సంస్కారాలు చేయవలసిన కర్మ ఏమిటి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Total Page Visits: 29 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed