మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ గారు ఈరోజు ఉదయం మరణించారు.

1 min read


తేది : 21.05.2021
డాక్టర్ సుధాకర్ మృతికి చంద్రబాబునాయుడు సంతాపం
డాక్టర్ సుధాకర్ ది ప్రభుత్వ హత్యే
: టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు
ప్రముఖ దళిత వైద్యులు డాక్టర్ సుధాకర్ మృతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు సుధాకర్ బలయ్యారని తెలిపారు. మాస్కులు అడిగిన పాపానికి శారీరకంగా, మానసికంగా వేధించి సుధాకర్ ను జగన్ ప్రభుత్వం బలిగొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధాకర్ మృతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. మానసికంగా వేధించి సుధాకర్ ని చంపారన్నారు. నడిరోడ్డు మీద బట్టలు తీసి, డాక్టర్ సుధాకర్ ను జగన్ ప్రభుత్వం వేధించింది. జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేక చర్యలకు ఒక డాక్టర్ బలైపోయాడన్నారు. దళిత డాక్టర్ మృతికి కారణమైన జగన్మోహన్ రెడ్డి ఇంతకింత అనుభవించే రోజులు దగ్గరపడ్డాయన్నారు. జగన్ ప్రభుత్వం మానసికంగా వేధించడంతోనే డాక్టర్ సుధాకర్ మృతిచెందినట్లు పేర్కొన్నారు. మృతుని కుటుంబ సభ్యులకు కోటి రూపాయలు పరిహారం ఇచ్చి, అన్ని విధాల ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Total Page Visits: 27 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed