విశాఖ నడిబొడ్డున పేకాట శిబిరం

1 min read

విశాఖపట్నం నగర నడిబొడ్డున శివాజీపాలెంలోని ఓ లాడ్జిలో శనివారం ఎంవీపీ జోన్‌ పోలీసులు దాడి చేసి పేకాడుతున్న 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.7.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. లాడ్జీలో భారీస్థాయిలో పేకాట నిర్వహిస్తున్నట్టు సమాచారంతో పోలీసులు దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో పేకాట నిర్వాహకుడు శ్రీకాకుళానికి చెందిన అందవరపు నాగరాజు, లాడ్జి నిర్వాహకుడు శరత్‌ సహా మొత్తం 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజులుగా ఇక్కడ పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. పట్టుపడిన వారిపై గ్యాంబ్లింగ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్టు ఎంవీపీ జోన్‌ సీఐ రమణయ్య వెల్లడించారు. నిందితుల్లో విశాఖతో పాటు శ్రీకాకుళం, రాజాం, పాలకొండ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారన్నారు. వీరంతా నగదును లాడ్జిలోని కౌంటర్‌లో డిపాజిట్‌ చేసి టోకెన్ల సహాయంతో జూదం ఆడుతున్నారని పేర్కొన్నారు.

Total Page Visits: 15 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed