వింత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి…

1 min read

పశ్చిమ గోదావరి జిల్లా

వింత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి…

ఆపరేషన్ కి డబ్బులు లేక దాతల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు.

పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామానికి చెందిన కార్పెంటర్ గా పనిచేస్తున్న ఇటుకల జయరాజు భార్య సలోమీ   దంపతులకు ఇద్దరు సంతానం, కుమారుడు  విన్విత్ 10 నెలల బాబు శరీరం ఎదుగుదల లేదు కానీ తల మాత్రం పెద్దదిగా పెరుగుతుంది. ఈ బాబు వింత వ్యాధితో బాధపడుతున్నాడు. కనీసం ఇల్లు గడవలేని పరిస్థితి అవసరాలు కూడా తీర్చుకోలేనంత కష్టం ఆ కుటుంబానికి సంభవించింది.

చేతిలో ఉన్న డబ్బంతా ఆపరేషన్ కి ఖర్చు చేశారు. ప్రస్తుతం వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. గతంలో ప్రభుత్వ హాస్పటల్ లో ఆపరేషన్ చేయించినా ప్రయోజనం లేకుండా పోయిందని మళ్లీ అదే తరహాలో తల పెద్దదిగా పెరగడంతో మరింత ఆందోళన చెందుతున్నారని బాధితులు వాపోతున్నారు.

కుమారుడిని బ్రతికించుకునేందుకు ఎవరైనా దాతలు సహాయం చేయాలని జయరాజు కోరుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరు కానీ, చెన్నై కానీ ఆస్పత్రుల్లో చికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. ఆపరేషన్‌ కోసం వైద్య ఖర్చులు కింద రూ. కొన్ని లక్ష పైనే కావాలని వైద్యులు చెబుతున్నారని తెలిపారు.

తమ వద్ద డబ్బు లేదని, దాతలు సాయం చేయాలని వేడుకున్నాడు. ఎవరైనా దాతలు ముందుకు వస్తే +91 6304155419 నంబర్ కు ఫోన్‌ చేసి సహాయపడాలని కొరుతున్నారు.

Total Page Visits: 27 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed