SGS TV Telugu

24×7 News

వన్ టౌన్ సిఐ కృష్ణ భగవాన్ గారిచే వృద్దులకు నూతనవస్త్రాలు, బ్రెడ్ పెకేట్స్ పంపిణీ.

1 min read


భీమవరం అమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోయ రాజా ఆధ్వర్యంలో జాలే విజయ కృప – దయామణి పెళ్లి రోజు సందర్భంగా వారిద్దరి సహకారంతో జడ్డు బ్రహ్మాజీ రావు ఆశ్రమంలో వృద్దులకు చీరలు, నూతన వస్త్రాలు, బ్రెడ్ పెకేట్స్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన భీమవరం వన్ టౌన్ సిఐ కృష్ణ భగవాన్ గారి చేతుల మీదుగా వృద్దులకు అందించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా వృద్ధులను, పెద్దలను జాగ్రత్తగా చూడాలని, మీ వంతు సహాయం వారికందించాలని అన్నారు, పేదలకు, వృద్దులకు, అనాథలకు, నిరాశ్రయులకు నిరంతర సేవలందిస్తున్న అమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోయ రాజా ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మి నారాయణ రాజు, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Total Page Visits: 27 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *