SGS TV Telugu

24×7 News

రావులపాలెంలో కోవిడ్ నిబంధనలు బేఖాతరు..

1 min read

రావులపాలెంలో కోవిడ్ నిబంధనలు బేఖాతరు..
కొన్ని షాపుల్లో సమయం దాటాకా అధిక ధరలకు విక్రయాలు..

అడిగితే దాడులకు యత్నం

కరోనా కేసుల్లో వేలల్లో నమోదవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం కఠిన నిబంధనలు ప్రకటించినా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ మాత్రమే వ్యాపార సంస్థలు నిర్వహించుకోవాల్సి ఉంది. అయితే కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో మాత్రం జిల్లా కలెక్టర్ ఆదేశాలు అమలు కావడం లేదు. చాలా దుకాణాలు తెరిచి ఇష్టారాజ్యంగా వ్యాపారాలు చేస్తున్నారు. చాలా మంది మాస్కులు కూడా ధరించకుండా విక్రయాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఆదివారం సాయంత్రం రావులపాలెం మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా మహాత్మా గాంధీ పంచాయతీ కాంప్లెక్స్ లో ఉన్న జ్యూస్ దుకాణం రాత్రి 8 గంటల వరకూ తెరిచి ఉంది. ఇదిలా ఉంటే వినియోగదారుల వద్ద నుంచి అధిక ధరలు వసూలు చేస్తుండడంతో ఒక వ్యక్తి నిలదీశాడు‌. రూ.100 విలువైన జ్యూస్ రూ.150 అని చెప్పడంతో అతను బిల్లు ఇమ్మని అడిగాడు. దీంతో జ్యూస్ షాపులో పనిచేసే యువకుడు అతడిపై జులుం ప్రదర్శించాడు.దాడి చేసేందుకు ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ యువకుడు కనీసం మాస్క్ కూడా ధరించకుండా గొడవకు దిగాడు. అతడి తీరుపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించినా స్పందించలేదు. దీంతో సదరు వ్యక్తి షాపు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ జ్యూస్ షాపులో మాత్రం రాత్రి 9గంటలైనా కూడా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రావులపాలెంలో నిబంధనలు ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా అమలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలను తూ.చా తప్పకుండా అమలు చేయాలని, అప్పుడే కరోనా వ్యాప్తిని అరికట్టగలమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Total Page Visits: 124 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *