SGS TV Telugu

24×7 News

రాత్రికి రాత్రే ప్రభుత్వ పాఠశాల మాయం

1 min read

అధికారులు. తక్షణమే బాద్యులు పైన చర్యలు చేపట్టాలి

సంఘసేవకుడు బొబ్బర చిన్న రాజు డిమాండ్

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం…

వాయిస్……………

కొయ్యలగూడెం 9వ వార్డు ఎంపీపీ స్కూల్ భవనాన్ని తొలగించి చదును చేసిన దృశ్యం.
కొయ్యలగూడెం: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అదృశ్యమైంది. కొయ్యలగూడెం తొమ్మిదో వార్డు రామాలయం స్కూల్ గా పిలవబడే ఈ పాఠశాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రెండవ తేదీ రాత్రికి రాత్రే తొలగించి స్థలాన్ని చదును చేశారు. పాఠశాల భవనం తొలగింపు విషయం తమకు ఫిర్యాదు అందిందని దీనిపై విచారణ చేపడుతున్నట్లు మండల విద్యాశాఖ అధికారి జె సురేష్ బాబు పేర్కొన్నారు. కాగా 35 సంవత్సరాల క్రితం నాటి ప్రభుత్వ పాఠశాల తొలగింపు ఆపై స్థల ఆక్రమణ వెనుక కొందరు పెద్దల హస్తం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవన తొలగింపులో విలువైన కలప కూడా ఉందని దానిని కూడా మాయం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఏఎస్ డబ్ల్యూవో కార్యాలయం వద్ద నూతనంగా పాఠశాల నిర్మించి తరగతులను అక్కడికి తరలించారు. తదనంతరం నిరుపయోగంగా ఉన్న పాఠశాల భవనం పై కన్నుపడ్డ కబ్జాదారులు ఈపని చేసి ఉంటారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామం నడిబొడ్డున ఉన్న విలువైన స్థలాన్ని కబ్జా చేయడం పై స్థానికులు స్పందించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో విచారణ నిష్పక్షపాతంగా చేయాలని అందులో విద్యనభ్యసించిన ఇటువంటి నాటి విద్యార్థులు నేటి పౌరులు కోరుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ బాలుర హైస్కూల్ లోని విలువైన ఫర్నిచర్ పెడదోవ పట్టిందని విద్యార్థి నాయకులు ఆరోపిస్తున్నారు. బీరువాలు, బల్లలు, బెంచీలు మేలు జాతి కలపకు చెందిన సామాగ్రి అని వీటి తరలింపు కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఆరోపిస్తున్నారు.ఈ విషయంలో కూడా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

Total Page Visits: 105 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *