మొత్తనికి మోసం వచ్చింది

1 min read

ఏలూరు

ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు ఆక్రమణలను తొలగించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించడం వల్ల వ్యాపారాలు లేక చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఈ సమయంలో ఒకరికి ఒకరు సఖ్యతగా ఉంటూ వారి వారి వ్యాపారాలను కొనసాగిస్తూ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకోవాల్సివుంది. అయితే ఇందుకు భిన్నంగా ఒక చోటనే వ్యాపారాలు చేసుకుంటున్న వారిలో మనస్పర్థలు రావడంతో ఏలూరు నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. రోడ్డు పోరంబోకు స్థలాన్ని ఆక్రమించుకుని తాత్కాలిక నిర్మాణాలు చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్న వారు ఇప్పుడు నిరాశ్రయులయ్యారు. ఉన్న ఉపాధిని కోల్పోయారు. ఏలూరు టౌన్ ప్లానింగ్ అధికారుల కథనం ప్రకారం ఏలూరు పాత బస్టాండ్ సమీపంలోని గూడ్స్ షెడ్ రోడ్డు, పాండురంగ పురం వద్ద రోడ్డు పోరంబోకు స్థలాన్ని ఆక్రమించుకుని ఆరుగురు వ్యక్తులు తాత్కాలిక నిర్మాణాల్లో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వీరిలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడంతో ఒకరిపై ఒకరు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. రోడ్డును ఆక్రమించుకుని వ్యాపార

Total Page Visits: 36 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed