మానవ సేవే”… “దేవుని సేవ”…
9వ_రోజు నిత్యావసర సరుకులు పంపిణీ

1 min read

గుంటూరు:
స్థానిక బ్రాడీపేట 4/9లోని “బ్రాహ్మణ చైతన్య వేదిక” రాష్ట్ర కార్యాలయంలో 3-6-21 గురువారం ఉదయం సంపత్ నగర్,పట్టాభిపురం, శ్యామల నగర్ ప్రాంతాల్లో ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న బ్రాహ్మణ కుటుంబాలకు…. మరియు స్వర్ణభారతి నగర్,నల్లపాడు మసీదులలో పనిచేస్తున్న ఇమాం,మౌజన్ లకు,గోరంట్ల చర్చి లలో పాస్టర్లకు రాష్ట్ర కార్యాలయంలో నిత్యావసర సరుకులను బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు వేంకట శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో “కొప్పనూరు రవికుమార్ ” సహకారంతో ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా శిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ గుంటూరు నగరం మరియు పరిసర ప్రాంతాల్లో కరోనా వైరస్ కర్ఫ్యూ నేపథ్యంలో పేద,మధ్యతరగతి బ్రాహ్మణ,క్రిస్టియన్, ముస్లిం ప్రార్ధనాలయాలలో పనిచేస్తున్న కుటుంబాలు ఆర్థికముగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బాగా ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ నిత్యావసర సరుకులను అందజేస్తున్నట్లు తెలితజేశారు. ఆకలికి కులం,మతం,ప్రాంత భేదాలు ఉండవని, ఈ “కరోనా” కారణంగా కొన్ని వర్గాల వారు అనేక ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న నేపద్యంలో వారికి 3 వారాలకు సరిపోయే నిత్యావసర వస్తువుల్ని బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా “కర్ఫ్యూ” సడలించే వరకు ఈ సహకారం ప్రతిరోజు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దాలిపర్తి శారదా, వడ్లమూడి రాజ, వడ్డమాను ప్రసాదు, మతుకుమల్లి సాయి, వేములపాటి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Total Page Visits: 98 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed