మానవత్వం చాటుకున్న రాజోలు మహిళా సర్పంచ్ రేవు జ్యోతి….

1 min read

కరోనా పాజిటివ్ తో మృతి చెందిన వ్యక్తి కి దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు రాజోలు సర్పంచ్ రేవు జ్యోతి… తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం కూనవరం గ్రామంలో ఈ రోజు ఉదయం కరోనా తో చెల్లింగి రంగారావు (75) మాజీ ఎంపీటీసీ సభ్యులు మృతి చెందారు. గ్రామస్థులు గాని బంధువులు గాని దగ్గరకు చేరడంలేదు ఎవరైనా అంతిమ సంస్కారాలు నిర్వహించే వారికి తెలియజేసి సాయపడాలంటూ కూనవరం గ్రామ ఉప సర్పంచ్ చెల్లింగి శ్రీనివాస్ సర్పంచ్ జ్యోతి దృష్టి కి తీసుకువచ్చారు… వెంటనే స్పందించిన రాజోలు సర్పంచ్ రేవు జ్యోతి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న పలువురుని ఆశ్రయించగా ఎవరూ అందుబాటులో లేకపోవడంతో తానే (జ్యోతి) దైర్యంగా ముందుకు వచ్చి రాజోలుకు చెందిన స్టార్ శ్రీను, జనసైనికుడు కోళ్ల బాబి, చింతలపల్లి గ్రామానికి చెందిన మట్టా సురేష్, బన్నా మరియు బాస్కర్ లతో మృతుని ఇంటికి చేరుకుంది. అక్కడ తనకు సహకారం అందిస్తున్న వారితో కలిసి పీపీఈ కిట్లు ధరించి ఇంటి వెనుకవైపు మంచంపై ఉన్న మృతదేహాన్ని కోవిడ్ నిబంధనలు మేరకు ప్రత్యేక కవర్ లో పెట్టి (BODY KIT) వాహనం ద్వారా రాజోలు కైలాసభూమి వద్దకు తరలించారు. అక్కడ మృతుని సాంప్రదాయాలకు అనుగుణంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు… ఒక మహిళా సర్పంచ్ కరోనాతో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించడం రాజోలు దీవిలో సంచలనం రేకెత్తించింది…
అయినవారు కూడా అక్కరకు రాని విపత్కర పరిస్థితుల్లో ఒక మహిళ తనకు సహకరించిన వారితో అంతిమ సంస్కారాలు నిర్వహించడంతో పలువురు అభినందనలు వ్యక్తం చేశారు…..

Total Page Visits: 25 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed