SGS TV Telugu

24×7 News

మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత

1 min read

మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత

విశాఖపట్నం: మాజీ ఎంపీ, తెదేపా నేత సబ్బం హరి (69) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో అనారోగ్యానికి గురై విశాఖ ఆరిలోవ అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. సబ్బం హరికి కొవిడ్తో పాటు ఇతర ఇన్ఫెక్షన్లు కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సబ్బం హరి స్వస్థలం తగరపువలస సమీపంలోని చిట్టివలస. గతంలో విశాఖ మేయర్గా పని చేశారు. 2009లో కాంగ్రెస్ నుంచి అనకాపల్లి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షులు
• సబ్బంహరి మృతి వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా
• సబ్బంహరి మృతి పార్టీకి తీరని లోటు
• సబ్బంహరి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి
• విశాఖ మేయర్ గా, ఎంపీగా సబ్బంహరి ప్రజలకు ఎనలేని సేవ చేశారు
• సబ్బంహరి మంచి వక్త
• సబ్బంహరి కుటుంబసభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది
అచ్చెన్నాయుడు గారి స్క్రోలింగ్స్-
• మాజీ ఎంపీ సబ్బం హరి మృతి పట్ల అచ్చెన్నాయుడు సంతాపం
• కరోనా బారిన పడి ఆయన మృతిచెందడం బాధాకరం
• సబ్బం హరి త్వరగా కోలుకోవాలని అంతా ఆశించాం, ఇంతలోనే మరణవార్త వినాల్సి రావడం దురదృష్టకరం
• విశాఖ మేయర్, ఎంపీగా ఆయన ప్రజలకు విశేషమైన సేవలు అందించారు
• సమస్యలపై పోరాడి ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు
• కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు.  ఈనెల 15 వ తేదీన సబ్బం హరి కరోనా బారిన పడ్డారు.  మూడోరోజులపాటు సబ్బం హరి హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.  తరువాత వైద్యుల సలహామేరకు ఆయన విశాఖ అపోలో ఆసుపత్రిలో చేరారు.  కరోనాతో పాటుగా ఆయనకు పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో పరిస్థితి విషమించింది.  వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు.  జూన్ 1, 1952 లో జన్మించిన సబ్బం హరి 1995 లో విశాఖపట్నానికి మేయర్ గా ఎంపికయ్యారు.  మేయర్ గా పనిచేసిన సమయంలో విశాఖ అభివృద్ధికి కృషిచేశారు.  15 వ లోక్ సభకు విశాఖ జిల్లాలోని అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి విజయం సాధించారు.

Total Page Visits: 105 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *