ప్రాజెక్ట్‌ ఫలాలు వీలైనంత త్వరగా అందించాలి: సీఎం జగన్‌

1 min read

పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిపై చర్చ
పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి పెండింగ్‌లో రూ. 1600 కోట్ల బిల్లులు
తాడేపల్లి: జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టుల నిర్మాణ ప్రగతిపై అధికారులతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. 91 శాతం స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు పూర్తయ్యాయని.. జూన్‌ 15 నాటికి మిగిలిన పనులు పూర్తిచేస్తాం అని అధికారులు తెలిపారు. ఈ నెలాఖరుకు స్పిల్‌ ఛానల్‌ పనులు పూర్తవుతాయని వెల్లడించారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌లో ఖాళీలను పూర్తిచేశామని.. జూన్‌ నెలాఖరుకు కాఫర్‌ డ్యామ్‌లో 1, 2 రీచ్‌లు పూర్తవుతాయన్నారు అధికారులుజులై ఆఖరుకు కాఫర్‌ డ్యామ్‌ 3, 4 రీచ్‌ పనులు నిర్ణీత ఎత్తుకు పూర్తి అవుతాయని తెలిపారు. దిగువ కాఫర్‌ డ్యాం పనులు కూడా వేగవంతం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 

Total Page Visits: 18 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed