SGS TV Telugu

24×7 News

ప్రస్తుత పరిస్థితుల్లో వివాహాలు వాయిదా వేసుకోవాలి.

1 min read

యాంకర్ వాయిస్ :–ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉండడంతో కొంతకాలం వివాహాలను వాయిదా వేసుకోవాలని నెల్లూరు జిల్లా వింజమూరు మండల తాసిల్దార్ ఎన్ వి కే సుధాకర్ రావు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వివాహాలు జరిగినట్లయితే ఆ వివాహ వేడుకకు అనేక ప్రాంతాల నుండి బంధువుల రాకపోకలు జరుగుతాయన్నారు.. ఈ క్రమంలో ఎవరికో ఒకరికి కరోనా సంక్రమించి నట్లయితే ఇరువర్గాల వారు బాధపడాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. కనుక ఎవరిలో ఈ వ్యాధి ఉందో తెలియని పరిస్థితి ఉంది కనుక వివాహాల పేరుతో అందరూ కలిసి ఉండడం వల్ల కరోనా వ్యాపించే అవకాశం మెండుగా ఉంటుంది కనుక వివాహం చేసుకోవాలనుకునే వారు ఆలోచించాలని ఆయన తెలిపారు. అదేవిధంగా దేవాలయాల్లో కానీ కళ్యాణ మండపాలలో గాని వివాహాలు జరిపినట్లయితే ఆలయ ధర్మకర్త లపై అలాగే కళ్యాణ మండపం యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కనుక ప్రజలు ఆలోచించి కరోనా తగ్గుముఖం పట్టే వరకు తమ వివాహ వేడుకలను వాయిదా వేసుకోవాల్సి ఉందిగా ఆయన కోరారు.
అలాగే మండలం లో ఉన్న ప్రైవేటు వైద్యశాలలో వైద్యులు ప్రస్తుత పరిస్థితులలో కరోనా చికిత్స చేయకూడదని కమాండ్ కంట్రోల్ మరియు తహసిల్దార్ ఎన్ వి కే సుధాకర్ రావు తెలిపారు. కరోనా నిబంధనను ఉల్లంఘించి ఎవరైనా ప్రైవేటు వైద్యులు కరోనా చికిత్స చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుని క్రిమినల్ చట్టం ద్వారా చర్యలు చేపడతామని హెచ్చరించారు.
బైట్స్ :–తహసీల్దార్. ఎంవీకే సుధాకర్ రావు

Total Page Visits: 36 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *