ప్రభుత్వ రంగ సంస్థలు ప్రవేట్ కానివ్వం. సిఐటియు నాయకులు తులసీరాం

1 min read

ప్రభుత్వ రంగ సంస్థలు ప్రవేట్ కానివ్వం. సిఐటియు నాయకులు తులసీరాం

కష్ట కాలం లో పేదలకు అండగా నిలిచే ప్రభుత్వరంగ సంస్థలను ప్రవేట్ కానివ్వబోమని సీఐటీయూ నాయకులు వి.తులసీరాం అన్నారు శనివారం 44వ రోజు జివిఎంసి వద్ద దీక్షలు ఆయన ప్రారంభించారు గతంలో హుధుద్ తుఫాన్ బాధితులను నేడు కోవిడ్ బారిన పడిన రోగులను ఆదుకోవడం లో ముఖ్యభూమిక పోషిస్తున్నాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు యువతకు ఉద్యోగాలు కల్పనలో ముందు పీఠిన ఉన్నాయన్నారు దేశంలో ఒక్క ప్రవేట్ పరిశ్రమ కూడా ఉపాది కల్పనలో కానీ పేదలకు అండగా నిలిచే దాఖలాలు లేవని గుర్తుచేశారు మోడీకి కార్పొరేట్ల భూతం పట్టిందని ఆభూతాన్ని వదిలించేందుకు కార్మికులు, రైతులు కలిసాయన్నారు స్టీల్ ప్లాంట్ను కాపాడు కోవడమే లక్ష్యంగా విశాఖ ప్రజలు వున్నారు గనుకనే ఈ క్లిష్ట సమయంలో కూడా దీక్షలు కొనసాగు తున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు మద్దిలపాలెం జోన్ అధ్యక్షులు వి.కృష్ణా రావు, నాయకులు కె.కుమారి, జె.కోదండ, పి.యన్.యం కార్యదర్శి ఎం. చంటి, ఆర్టీసీ యస్.డబ్ల్యు. యఫ్ నాయకులు టి.యల్.కాంతం, పి.యస్.రావు, చిన్నారావు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Total Page Visits: 4 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed