నగరి అర్బన్ పి.హెచ్.సి కి “రోజా చారిటబుల్ ట్రస్ట్” మందులు, వైద్య పరికరాలు పంపిణీ

1 min read


నగరి గౌరవ శాసనసభ్యురాలు శ్రీ మతి ఆర్.కె.రోజా గారి “రోజా చారిటబుల్ ట్రస్టు” తరపున ఆమె సోదరులు శ్రీ రాంప్రసాద్ గారు నగరి అర్బన్ పి.హెచ్.సి కి అవసరమైన మందులు, మాత్రలను శనివారం అందచేయడం జరిగింది. రోజా చారిటబుల్ ట్రస్టు ఆద్వర్యంలో నగరి అర్బన్ పి.హెచ్.సి సెంటర్ లో శనివారం అక్కడి వైద్య అధికారులకు 5 స్తెతస్కోప్ లు, 20 పల్స ఆక్సీమీటర్లు, 20 దర్మామీటర్లు, 10.బీపీ ఆపరేటర్ లు, 10.డిజిటల్ బీపీ ఆపరేటర్ లు, 500 జతల సర్జికల్ గ్లోవ్స్, 1000 జతల గ్లోవ్స్, 100 ఫేస్ షీల్డులు, కాటన్ రోల్స్ తదితర వైద్య పరికరాలు, స్టేషనరీ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నగరి మునిసిపల్ కమీషనర్ నాగేంద్ర ప్రసాద్, డా.రేణుక, డా.భువనేశ్వరి, డా. ముని చెంగలయ్య, మున్సిపల్ చైర్మన్ నీలమేఘం, వైఎస్సార్ సిపి నాయకులు చంద్రారెడ్డి, వెంకటరత్నం, ముని, దయానిధి, బిలాల్, బాబు, ఎల్లప్ప రెడ్డి, ఇలంగోవన్, భూపాలన్ తదితరులు పాల్గొన్నారు.

Total Page Visits: 20 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed