SGS TV Telugu

24×7 News

ధూళిపాళ్ల నరేంద్ర ఏసీబీ కస్టడీపై హైకోర్టు స్టే

1 min read

అమరావతి: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఏసీబీ కస్టడీపై ఏపీ హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలయింది. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. 5 రోజుల కస్టడీకి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఏసీబీ కస్టడీపై హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే సోమవారం పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని పేర్కొంది. దీంతో ధూళిపాళ్ల నరేంద్రను ఆదివారం ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది.

కాగా సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారని ధూళిపాళ్లపై ఆరోపణలు రావడంతో ఏసీబీ ఐదు రోజుల కస్టడీకి తీసుకుంది. విజయవాడ ఏసీబీ కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర‌కు శనివారం తొలిరోజు ఏసీబీ కస్టడీ ముగిసింది. 5 గంటల పాటు ఆయనను ఏసీబీ అధికారులు విచారించారు. అనంతరం విజయవాడ సబ్ జై‌లుకు తరలించారు.

Total Page Visits: 30 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *