దారుణం.. ఇంజనీరింగ్ విద్యార్థినిపై అఘాయిత్యం

1 min read

ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. తన దుకాణంలో పనిచేస్తున్న యువతిపై ఓ యజమాని మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన యువతి ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీ మూతపడడంతో ఆమె పట్టణంలోని ఓ ఫుడ్ ఐటెమ్స్ షాప్ లో పని చేస్తోంది. ఆ షాప్ యజమాని సోమవారం దుకాణంలో ఎవరూ లేని సమయంలో ఆ యువతికి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. కొద్దిసేపటికే ఆమె మత్తులోకి జారుకోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. స్పృహలోకి వచ్చాక విషయం అర్థమైన యువతి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యజమానిపై పొన్నూరు అర్బన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.

Total Page Visits: 184 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed